Regina Cassandra: సోషల్ మీడియా ద్వారా సినిమాతారలకు చాలా పాపులారిటీ వస్తుంది. సినిమాలతో కంటే కొంతమంది హీరోయిన్లు కవ్వించే ఫోటోలు మాతెక్కించే వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వుంటారు సినిమాతారలు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా నెటిజెన్ల చేత విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.తాజాగా ఓ హీరోయిన్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఒక్క ఫొటోతో ఆ హీరోయిన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అన్ ఫాలో కూడా అవుతున్నారు. ఇంతకు ఆ అమ్మడు ఎవరు..? ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఏంటి..?
‘శివ మనసులో శృతి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది రెజీనా కాసాండ్రా. ఈ ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది రెజీనా. తెలుగులోనే కాదు తమిళ్‌లోను సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అటు బాలీవుడ్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ చిన్నది. అయితే ఇప్పుడు రెజీనా జోరు కొంత తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రెజీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా రెజీనా ఓ మద్యం కంపెనీ ప్రేమోషన్స్ లో భాగంగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకి.. ప్రయాణం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని, ఈ మధురక్షణాలను మద్యంతో సెలబ్రేట్ చేసుకుంటానని రాసుకొచ్చింది. దాంతో ఈ ఫోటో పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి యాడ్స్ చేస్తావా అని కొందరు ఆమెను అన్ ఫాలో చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :