AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Prema: పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు.. కారణం చెప్పిన హీరోయిన్ ప్రేమ..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ ప్రేమ. దేవి సినిమాతో తెలుగులో స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత సహయ నటిగా కనిపించి విలనిజం సైతం పండించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రేమ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించింది.

Actress Prema: పెళ్లైన కొన్ని రోజులకే భర్తతో విడాకులు.. కారణం చెప్పిన హీరోయిన్ ప్రేమ..
Prema
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2026 | 12:43 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ ప్రేమ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రేమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, వదంతులు, అలాగే తన జీవన శైలి గురించి వివరంగా మాట్లాడారు. క్యాన్సర్, విడాకులు, రెండో పెళ్లి వంటి విషయాలపై ఆమె స్పష్టతనిచ్చారు. గతంలో తనకు క్యాన్సర్ వచ్చినట్లు వచ్చిన వార్తలు కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని ప్రేమ స్పష్టం చేశారు. తాను న్యూజిలాండ్‌లో ఉన్న సమయంలో ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయని, అయితే అవి నిజం కాదని తెలిపారు. సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, గౌతమి వంటి నటీమణులు క్యాన్సర్‌తో పోరాడి గెలిచారని పేర్కొంటూనే, తన విషయంలో అది కేవలం ఒక వదంతి మాత్రమేనని తేల్చిచెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలు తనను మరింత బలపడేలా చేశాయని, తన తల్లిదండ్రుల మద్దతు కూడా తనలో ధైర్యాన్ని నింపిందని ప్రేమ అన్నారు.

గత ఏడాది తన రెండో పెళ్లి గురించి వచ్చిన వార్తలపై కూడా ప్రేమ స్పందించారు. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, తన జీవితానికి తోడుగా నిలిచే మంచి వ్యక్తి దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని తెలిపారు. 70 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి తప్పు లేదని ఆమె తన ఆలోచనను వెల్లడించారు.

ప్రేమ తన కుటుంబ నేపథ్యం గురించి కూడా మాట్లాడారు. తన తండ్రి కేఎస్ఆర్టీసీ టూరిజంలో డ్రైవర్‌గా పనిచేశారని, తల్లి గృహిణి అని తెలిపారు. తన తల్లి షూటింగ్స్‌కు తనతో పాటు వచ్చేవారని, నటన పట్ల తనలో ఆసక్తిని పెంచారని చెప్పారు. మొదట్లో తన తండ్రి నటనను ప్రోత్సహించకపోయినా, రెండో సినిమాతో స్టేట్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఆయన చాలా గర్వపడ్డారని, డ్రైవర్ కూతురు స్టార్ హీరోయిన్ అయిపోయింది అని క్యాప్షన్లు కూడా వచ్చేవని ప్రేమ గుర్తు చేసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం తన తండ్రి మరణించారని ఆమె భావోద్వేగంగా చెప్పారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ తన జీవితంలో కీలక పాత్ర పోషించారని, తన తండ్రి ప్రోత్సహించేవారని, తన తల్లి మాత్రం తాను మరింత కృషి చేయాలని, క్యారెక్టర్ కోసం పోరాడాలని మోటివేట్ చేసేవారని వివరించారు.

ప్రేమ సోదరి దుబాయ్‌లో గృహిణిగా ఉంటూ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉందని, ఆమె సోదరుడు అయ్యప్ప కనరా బ్యాంక్‌లో అధికారిగా పనిచేస్తున్నారని తెలిపారు. అయ్యప్ప గతంలో రంజీ ప్లేయర్ అని, ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. తన సోదరుడు తనకు పూర్తి నైతిక మద్దతు ఇస్తారని ప్రేమ అన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో తనకు ఎవరూ సహాయం చేయరని, తన నిర్ణయాలను తానే తీసుకుంటానని, ఆలోచించి, చర్చించి, లోతుగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఖాళీగా కూర్చోవడం తనకు కష్టమని, సినిమాలు చూడటం, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం తనకు ఇష్టమని చెప్పారు. స్టార్ హీరోయిన్లు అంటే పెద్ద కోటలు, సెక్యూరిటీ, మేనేజర్లు ఉంటారనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, ప్రేమ మాత్రం నిరాడంబరతను ఇష్టపడతారు. కెమెరా ముందు నటిగా, మేకప్ తీసేసిన తర్వాత తల్లిదండ్రులకు కూతురిగా ఉండటానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రేమ అన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, అంతర్గత సంతోషమే ముఖ్యమని, జీవితంలో డబ్బు ఎంత కావాలో అంతే ఉండాలని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us