నేను ఇండియన్‌నే: ట్రోలర్స్‌కి ఖుబ్బూ సవాల్..!

తనపై వస్తోన్నవిమర్శలకు గట్టిగా సమాధానం ఇస్తూ.. ఘాటుగా ట్వీట్ చేస్తారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఖుష్బూ. ఖాళీగా కూర్చోని నాపై ట్రోల్స్‌ చేయడం తప్ప ఇంకా పనేం లేదా.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముస్లింను కాబట్టి తనను జిహాదీగా విమర్శిస్తున్న వారంతా.. దమ్ముంటే తమ అసలు ఫొటోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ట్వీట్టర్‌లో ‘మీరు చేసే దూషణలు నాపై ఎలాంటి ప్రభావమూ చూపవని.. నేను ఇండియన్‌ని.. భారతీయురాలిగానే పుట్టా.. అలాగే మరణిస్తా.. కానీ.. […]

నేను ఇండియన్‌నే: ట్రోలర్స్‌కి ఖుబ్బూ సవాల్..!

Updated on: Aug 03, 2019 | 8:06 PM

తనపై వస్తోన్నవిమర్శలకు గట్టిగా సమాధానం ఇస్తూ.. ఘాటుగా ట్వీట్ చేస్తారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఖుష్బూ. ఖాళీగా కూర్చోని నాపై ట్రోల్స్‌ చేయడం తప్ప ఇంకా పనేం లేదా.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముస్లింను కాబట్టి తనను జిహాదీగా విమర్శిస్తున్న వారంతా.. దమ్ముంటే తమ అసలు ఫొటోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ట్వీట్టర్‌లో ‘మీరు చేసే దూషణలు నాపై ఎలాంటి ప్రభావమూ చూపవని.. నేను ఇండియన్‌ని.. భారతీయురాలిగానే పుట్టా.. అలాగే మరణిస్తా.. కానీ.. మీరు రాముడి పేరును అపవిత్రం చేయకండి.. కొంచెమైనా సిగ్గుపడండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు ఖుష్బూ. కాగా.. ఇది వరకు చాలా సందర్భాల్లో.. రాముడి పేరు ఎందుకు వివాదాల్లోకి లాక్కొస్తారు.. ఆయనంటే నాకు చాలా ఇష్టమని కూడా అన్నారు.

గత కొంతకాలంగా ఖుష్బూ.. ముస్లిం అని.. తను ఇండియా నుంచి వెళ్లిపోవాలని ట్రోల్స్ మొదలయ్యాయి. ఖుష్బూ ప్రముఖ నటి.. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఆమె నటించారు. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. డైరెక్టర్‌ సుందర్‌ను పెళ్లి చేసుకున్నాక.. ఖుష్బూ అని పేరు మార్చుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us