Actress : ఇండస్ట్రీని ఏలిన అందాల రాశి.. కానీ చిరు, బాలకృష్ణ సరసన నటించని ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని హావా..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హీరోలతో నటించాలని అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ కోరుకునేవారు. కానీ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఓ హీరోయిన్ మాత్రం ఈ ఇద్దరూ హీరోల సరసన నటించలేదు. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : ఇండస్ట్రీని ఏలిన అందాల రాశి.. కానీ చిరు, బాలకృష్ణ సరసన నటించని ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని హావా..
Chiranjeevi, Balakrishna

Updated on: Nov 17, 2026 | 5:31 PM

దక్షిణాది సినీ పరిశ్రమలో 80, 90వ దశకంలో తన అందం, అభినయంతో ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు అప్పట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన మాత్రం ఒక్క చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించలేదు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ స్వయంగా వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు చేయకపోవడంపై స్పందిస్తూ ఖుష్బూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నేను తెలుగు సినిమాతోనే నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. వెంకటేష్ సరసన నటించిన ‘కలియుగ పాండవులు’ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చినా, అదే సమయంలో తమిళంలో భారీ ప్రాజెక్ట్‌లు వరుసగా క్యూ కట్టాయి. ఆ రోజుల్లో సినిమా పరిశ్రమ ఎక్కువగా చెన్నై కేంద్రంగానే నడిచేది. అప్పట్లో నేను కోలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌గా మారిపోవడంతో చెన్నైలోనే పూర్తిగా లాక్ అయిపోయాను. బాలకృష్ణగారితో సినిమా చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ, తమిళ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. అంతే తప్ప వారిపై ఉన్న గౌరవంతో కాకుండా కేవలం డేట్స్ సమస్య వల్లే ఆ సినిమాలు మిస్ అయ్యాయి” అని ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

అగ్ర హీరోలతో హీరోయిన్‌గా నటించలేకపోయినా, ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఖుష్బూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రంలో ఆయనకు సోదరిగా నటించి మెప్పించారు. అలాగే ఓ రియల్ ఎస్టేట్ కమర్షియల్ యాడ్‌లో చిరు సరసన భార్యగానూ కనిపించారు. అయితే, చిరంజీవి, బాలకృష్ణ లాంటి లెజెండరీ హీరోలతో హీరోయిన్‌గా నటించే అవకాశం మిస్ అయ్యాననే వెలితి మాత్రం తనలో ఇంకా ఉందని, భవిష్యత్తులో అలాంటి మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానని ఖుష్బూ పలు సందర్భాల్లో మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ చేస్తూ అటు సినిమాల్లో, ఇటు బుల్లితెరపై బిజీగా గడుపుతున్న ఖుష్బూ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

చిరంజీవి, బాలకృష్ణ, ఖుష్బూ..

Chiranjeevi, Balakrishna, Khushboo 

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us