సాటిలేని స్వీటీ.. ఆమెకెవరు మేటి..? సూపర్ లేడీ అనుష్క బయోగ్రఫీ

‘అనుష్క అలియాస్.. స్వీటీ’.. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ముద్దుగా ఫ్యాన్స్ అందరూ అనుష్కను ‘స్వీటీ’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే నిజంగా స్వీటీనే అనుష్క. అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలో జన్మించింది. అనుష్కను ఇంట్లోని వారందరూ స్వీటీ అని పిలిస్తే.. ఫ్రెండ్స్ సరదాగా ‘టొమ్ములు’ అని వ్యవహరిస్తారు. బెంగుళూరుకు చెందిన అనుష్క.. యోగా శిక్షకురాలు. తనకు యోగా అంటే చాలా ఇష్టమని.. రోజూ తప్పక యోగా.. చేస్తానని.. ఇదివరకే […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:42 pm, Mon, 22 July 19
సాటిలేని స్వీటీ.. ఆమెకెవరు మేటి..? సూపర్ లేడీ అనుష్క బయోగ్రఫీ

‘అనుష్క అలియాస్.. స్వీటీ’.. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ముద్దుగా ఫ్యాన్స్ అందరూ అనుష్కను ‘స్వీటీ’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే నిజంగా స్వీటీనే అనుష్క. అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలో జన్మించింది. అనుష్కను ఇంట్లోని వారందరూ స్వీటీ అని పిలిస్తే.. ఫ్రెండ్స్ సరదాగా ‘టొమ్ములు’ అని వ్యవహరిస్తారు. బెంగుళూరుకు చెందిన అనుష్క.. యోగా శిక్షకురాలు. తనకు యోగా అంటే చాలా ఇష్టమని.. రోజూ తప్పక యోగా.. చేస్తానని.. ఇదివరకే చాలా సందర్భాల్లో చెప్పింది. ‘సూపర్’ సినిమాతో సినీ రంగంలోకి అను బేబీ అడుగు పెట్టింది. ఆ తర్వాత స్వీటీ మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, లక్ష్యం, డాన్, ఒక్క మగాడు, స్వాగతం, బలాదూర్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్ సినిమాల్లో నటించింది. అనంతరం వచ్చిన ‘అరుంధతి’ సినిమా అనుష్క కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో అనుష్క గ్రాఫ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. 13 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపు 68 కోట్లను రాబట్టింది. ఆ తర్వాత బిల్లా, కేడి, యుముడు, సింగం సినిమాల్లో నటించింది.

ఇక ‘వేదం’ సినిమాలో వేశ్య పాత్రలో నటించి.. సాహసమే చేసింది స్వీటీ. ఈ మూవీ సక్సెస్‌ కూడా అయింది. ఆ తర్వాత పంచాక్షరి, ఖలేజా, నాగవల్లి, రగడ, ఢమరుకమ్, మిర్చి, సింగం2, రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి2లో నటించి ప్రపంచవ్యాప్తంగా అను బేబీ ఫేమస్ అయ్యింది. ఇక సైజ్ జీరో సినిమా కోసం ఏ.. హీరోయిన్ చేయని సాహసం చేసి.. బరువు పెరిగింది. మళ్లీ బరువు తగ్గడం కోసం చాలా కష్టపడింది కూడా. ఇక భాగమతి సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంది.. ఓ రకంగా తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పుకోవాలి. ప్రెజెంట్ అనుష్క ‘సైలెన్స్’ సినిమాలో నటిస్తోంది. ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ పేజ్‌ని క్రియేట్ చేసుకున్న స్వీటీ.. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.