Sonu Sood Tailor Shop: టైలరింగ్ షాప్ ఓపెన్ చేసిన సోనూ సూద్.. బట్టలు కుట్టడంలో గ్యారెంటీ లేదు

నటుడు సోను సూద్ వెండి తెరపై విలన్.. కానీ నిజ జీవితంలో హీరో. కరోనా సమయంలో కష్టంలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి దేశ వ్యాప్తంగా దేవుడయ్యాడు. ఎవరికైనా అవసరం అని తెలిస్తే...

Sonu Sood Tailor Shop: టైలరింగ్ షాప్ ఓపెన్ చేసిన సోనూ సూద్.. బట్టలు కుట్టడంలో గ్యారెంటీ లేదు
ట్విట్టర్ వేదికగా ఎవరు సాయం కోరిన వెంటనే వారి కష్టాన్ని తీరుస్తున్నాడు సోనూసూద్. 

Updated on: Jan 16, 2021 | 6:04 PM

Sonu Sood Tailor Shop: నటుడు సోను సూద్ వెండి తెరపై విలన్.. కానీ నిజ జీవితంలో హీరో. కరోనా సమయంలో కష్టంలో ఉన్న వారికి తన వంతు సాయం అందించి దేశ వ్యాప్తంగా దేవుడయ్యాడు. ఎవరికైనా అవసరం అని తెలిస్తే తనవంతు సాయం అందిస్తున్న సోనూ సూద్ ఎక్కడి వెళ్లినా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సోను తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో లో సోను బట్టలు కుడుతున్న దర్జీగా మారాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యలో సోనూ సూద్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ బట్టలు కుట్టే మిషన్ కనిపించడంతో తన క్రియేటివిటికీ పనిచెప్పాడు.. ఓ క్లాత్ ను తీసుకుని ప్యాంట్ కుట్టడానికి ప్రయత్నించారు. ఆయితే ప్యాంట్ కుట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ప్యాంట్ షేప్స్ మార్చుకుని నిక్కరులా తయారు అయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. సోనూసూద్ టైలరింగ్ షాప్. ఇక్కడ దుస్తులు ఉచితంగా కుట్టబడును.. అయితే ప్యాంట్‌‌లు కుట్టమని ఇస్తే.. నిక్కర్లు అవుతాయేమో.. ఆ విషయంలో గ్యారెంటీ లేదు’ అంటూ ఫన్నీ కామెంట్ ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ అవుతుంది. ఆచార్య షూటింగ్ సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్ కి 100 సెల్ ఫోన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: అయోధ్యలో రామమందిరానికి రఘురామకృష్ణరాజు విరాళం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు