The Paradise : ఓటీటీకి వచ్చేస్తున్న నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ది ప్యారడైజ్. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రం అటు మ్యూజిక్ పరంగానే కాకుండా ఇటు కంటెంట్ పరంగానూ దుమ్మురేపింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రయూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది.

The Paradise : ఓటీటీకి వచ్చేస్తున్న నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఎక్కడ చూడొచ్చంటే..
The Paradise Movie

Updated on: Oct 18, 2026 | 12:59 PM

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ అనౌన్స్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా పై హైప్ ఉండేది. మరోవైపు అటు యూట్యూబ్ లో సాంగ్స్ సైతం దూసుకుపోయాయి. ఈ క్రమంలోనే భారీ హైప్ నడుమ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కొన్ని ప్రాంతాలలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, నాని కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ అండ్ బోల్డ్ అటెంప్ట్‌గా నిలిచింది. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో నాని నటన, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది.

ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?

ది ప్యారడైజ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 22 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుండటం విశేషం. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ అండ్ రా మాస్ పాత్రలో కనిపించారు. ఆయన మేకోవర్, డ్రెస్సింగ్ , మేనరిజమ్స్ నేచురల్ స్టార్ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని రీతిలో డిఫరెంట్ అప్రోచ్‌తో కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన శ్రీకాంత్ ఓడెల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పీరియాడిక్ అండ్ క్రైమ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని తెరకెక్కించిన విధానం , విజువల్ ప్రజెంటేషన్ ఆకట్టుకున్నాయి. ఇందులో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేయగా.. కయాదు లోహర్ కథానాయికగా కనిపించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులు , నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ యాక్షన్ డ్రామాను ఆస్వాదించవచ్చు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ , విజువల్స్ ఓటీటీ ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తాయని భావిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ది ప్యారడైజ్ ఓటీటీ..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us