Ashish Vidyarthi : 55 ఏళ్ల వయసులో విడాకులు.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ విలన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి నాయకుడిగా, సహాయ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు బుల్లితెరపై యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే 55 ఏళ్ల వయసులో భార్యతో విడాకులు తీసుకోవడం ఆ తర్వాత 60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవడం పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Ashish Vidyarthi : 55 ఏళ్ల వయసులో విడాకులు.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ విలన్..
Ashish Vidyarthi

Updated on: Nov 05, 2026 | 9:09 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి నాయకుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు నటుడు అశిష్ విద్యార్థి. అయితే సినిమాలే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంటారు. ఇటీవల 60 ఏళ్ల వయసులో రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ వివాహం అటు ఫిల్మ్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన తాజాగా తన మొదటి వివాహం, విడాకులతోపాటు రెండో పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైన ఈ క్లిష్టమైన పరిస్థితితోపాటు ఆ బాధ నుంచి తాను ఎలా బయటపడ్డాను అనే విషయాన్ని వెల్లడించారు. అశిష్ మొదటి వివాహం నటి, గాయని రాజోషితో జరిగింది. వీరికి అర్ధ అనే కుమారుడు ఉన్నాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్న అశిష్ విద్యార్థి 2023లో మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ నటుడు మాట్లాడుతూ.. “24 సంవత్సరాల తర్వాత మా వివాహ బంధం ముక్కలైనప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి నా వయస్సు దాదాపు 55 సంవత్సరాలు. అంతా నాశనమైపోయినట్లు అనిపించింది . ఒక దానిలో ఇంతగా పెట్టుబడి పెట్టి , దాని నుండి అటువంటి ఫలితాలను పొందడం చాలా కష్టం. చాలా వ్యక్తిగత కారణం వల్ల నా బంధం ముగిసింది . దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు, కానీ జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

‘నేను ఒక మోటివేషనల్ స్పీకర్, నటుడిని. కానీ నా గురించి ప్రజలు ఏమన్నారో, నేను దానిని ఎలా ఎదుర్కొన్నానో నాకు తెలుసు. ప్రజలు నిరసన తెలిపినప్పుడు, వారికి పరిస్థితి అర్థం కాదు. అయినా కూడా, వారు ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారు. ఇలాంటిది జరిగినప్పుడు, ఒక్క వ్యక్తి కాదు, అందరూ మాట్లాడతారు . ప్రజలు నాతో, ‘ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సహజీవనం ఎందుకు చేయకూడదు?’ అని అనేవారు. కొంతమంది నా కెరీర్ ముగిసిపోయిందని , నేను నిశ్శబ్దంగా కూర్చుని నా కొడుకు పెరగడాన్ని చూడాలని అన్నారు. నేను ప్రజలతో ఇవన్నీ మాట్లాడటం ఆపమని చెప్పాల్సి వచ్చింది ‘ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

Loading...
Unable to load recommendations.
Follow Us