Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్‌..

Rashmika Mandanna: ప్రస్తుతం హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకేరకమైన పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు పోషించాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood) టాప్‌ హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు..

Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్‌..
Rashmika Mandana

Updated on: Mar 13, 2022 | 12:56 PM

Rashmika Mandanna: ప్రస్తుతం హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకేరకమైన పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు పోషించాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌ (Tollywood) టాప్‌ హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లో హీరోయిన్లు నటించాలంటే పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. కానీ గత కొన్ని రోజులుగా టాప్‌ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్నారు. తాజాగా సమంత పుష్పలో ‘ఊ అంటావా’ అంటూ ఎలాంటి హంగామా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క పాటతో బాలీవుడ్‌లో దుమ్మురేపింది సామ్‌.

ఇదిలా ఉంటే నేషనల్‌ క్రష్‌, అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన కూడా సమంత బాటలోనే నడుస్తుందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. దర్శకుడు సందీప్‌ వంగా బాలీవుడ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యానిమల్‌ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు ఓ వార్త బీటౌన్‌లో సందడి చేస్తోంది. ఈ వార్తల ప్రకారం రష్మిక ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది. సినిమాకే హైలట్‌గా నిలిచే ఈ పాటలో రష్మిక అయితే బాగుటుందని సందీప్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇందుకు రష్మిక కూడా సానుకూలంగా స్పందించిందంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలిలాయంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక పుష్ప సీక్వెల్‌తో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: శ్రేయా ఘోషల్‌ గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?

Gold Imports: కరోనా ముందునాటికి బంగారం దిగుమతులు.. ఎక్కడి నుంచి ఎంత బంగారం వస్తోందంటే..

Loan Case: విశాల్‌కు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశాలు

Follow Us