Samantha: సమంత హాలీవుడ్‌ చిత్రానికి ఆ హీరోనే కారణమా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త..

Samantha: ఇటీవలి కాలంలో సమంత పేరు మారుమోగుతోంది. దీనికి నాగచైతన్యతో విడిపోవడం ఓ కారణమైతే, నటి చేస్తోన్న సినిమాలు మరో కారణంగా చెప్పవచ్చు. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత...

Samantha: సమంత హాలీవుడ్‌ చిత్రానికి ఆ హీరోనే కారణమా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త..
Samantha

Edited By:

Updated on: Nov 30, 2021 | 6:02 PM

Samantha: ఇటీవలి కాలంలో సమంత పేరు మారుమోగుతోంది. దీనికి నాగచైతన్యతో విడిపోవడం ఓ కారణమైతే, నటి చేస్తోన్న సినిమాలు మరో కారణంగా చెప్పవచ్చు. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించిన సమంత కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజాగా విడాకుల నిర్ణయం తర్వాత సినిమాలతో బిజీగా మారిపోయింది. కొత్త కొత్త పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులో కొన్ని సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు అవకాశాలను కొట్టేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ఇటీవల సమంత ఏకంగా హాలీవుడ్‌ చిత్రంలో నటించే లక్కీ చాన్స్‌ కొట్టేసిన విషయం తెలిసిందే. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా కనిపించనుంది. మరో ఛాలెజింగ్‌, బోల్డ్‌ పాత్రతో సమంత సందడి చేయనుందన్న వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వార్తే వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లను కాదని సమంతనే ఈ పాత్ర కోసం ఎందుకు ఎన్నుకున్నారనే చర్చ జరుగుతోంది.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ పాత్రకు కోసం సమంత అయితే బాగుంటుందని హీరో రానా చెప్పడంతోనే ఈ పాత్ర ఆమెకు దక్కిందనేది సదరు వార్త సారాంశం. విడాకుల కంటే ముందు రానా సమంతకు బంధువు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Also Read: India Covid Vaccines: ఒమిక్రాన్ బాధిత దేశాలకు వ్యాక్సిన్ సరఫరా.. అత్యవసర మందులను అందించడానికి భారత్ రెడీ..

IPL 2022 retentions: మా ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.. లక్నోపై పంజాబ్‌, హైదరాబాద్‌ ఫ్రాంఛైజీల ఫిర్యాదు..

IIIT Hyderabad: తెలుగుపై పట్టుందా.? తెలుగులో రాయగలరా.? అయితే ఈ అవకాశం మీకోసమే.. ఐఐఐటీ హైదరాబాద్‌లో..

Loading...
Unable to load recommendations.
Follow Us