Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కొత్త డేట్‌ కాన్ఫామ్‌.! ఎప్పుడంటే..

|

Feb 22, 2022 | 9:50 AM

Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌పై భారీ అంచనాలున్నా్యి. రానా, పవన్‌లు కలిసి నటిస్తుండడం.. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తుండడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల దృష్టిపడింది. ఇక కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడిన...

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కొత్త డేట్‌ కాన్ఫామ్‌.! ఎప్పుడంటే..
Bheemla Nayak Pre Release E
Follow us on

Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌పై భారీ అంచనాలున్నా్యి. రానా, పవన్‌లు కలిసి నటిస్తుండడం.. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తుండడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల దృష్టిపడింది. ఇక కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు ఫిబ్రవరి 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్‌ అయ్యింది. ఇందులో భాగంగానే సోమవారం (ఫిబ్రవరి 21) రోజున ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్‌ భావించింది. ఈ ప్రోగ్రామ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను (KTR) ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గౌతమ్‌ రెడ్డి అకాల మరణంతో చిత్ర యూనిట్‌ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఈవెంట్‌ను నిర్వహిస్తారా.? లేదా.? అన్న చర్చ కూడా జరిగింది.

అయితే తాజాగా చిత్ర యూనిట్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలను బుధవారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం ఈవెంట్‌ను జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపు కాన్ఫామ్‌ అయినట్లు సమాచారం. ముందుగా అనుకున్న యూసుఫ్‌ గూడాలోని పోలీస్‌ గ్రౌండ్‌లో రేపు సాయంత్రం 6 గంటలకు ఈవెంట్‌ ప్రారంభంకానున్నట్లు సమాచారం. మరికాసేపట్లో చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సోమవారం ఈవెంట్‌ నిర్వహించకపోవడం వల్ల నిరాశ చెందిన ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ రూపంలో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నిజానికి ట్రైలర్‌ను కూడా ప్రిరీలిజ్‌ ఈవెంట్‌లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఈవెంట్‌ వాయిదా పడడంతో అభిమానుల కోసం సోమవారమే ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పవన్‌ నటనకు ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

Also Read: Assemby Meet: ఈనెల 25 లేదా 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ముందు రోజే భేటీ కానున్న కేబినెట్!

ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. పని చేసే చోటే ఉరేసుకున్నాడు..

News Watch: ఆ రెండు సంఘటనలు చాలు గౌతమ్ రెడ్డి ‘లీడర్’ అని చెప్పడానికి.. వీడియో