The Kashmir Files: అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకుడిగా వ్యవహిరించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయని చెబుతున్న వార్తలు గురించి అభిషేక్ అగర్వాల్ స్పందించారు.
రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాల్ని నిర్భయంగా ఈ సినిమాలో చూపిస్తున్నామని, ఇందులో ఎలాంటి కల్పితాలకు తావుండదని చెప్పారు.1980-90 మధ్యకాలంలో కశ్మీర్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించామన్నారు. ఆ సమయంలో కశ్మీర్ పండిట్స్‌కు ఎలాంటి అన్యాయం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. కశ్మీర్‌లో ఎన్నో ప్రతికూలతల మధ్య షూటింగ్ చేశామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నామని త్వరలో టీజర్‌ను విడుదలచేస్తామని చెప్పారు.
Rider Teaser : నిఖిల్ కుమార్ హీరోగా నటించిన రైడర్ టీజర్ రిలీజ్.. ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందంటారా?