Bigg Boss-4 : అభిజిత్‌ బిగ్‌బాస్-4 విజేతగా నిలిచినా.. ప్రైజ్‌మనీ మాత్రం తగ్గిపోయింది.. కారణం ఎంటో తెలుసా?

|

Dec 21, 2020 | 1:29 AM

అభిజిత్ చూడ చక్కని రూపం, అందమైన నవ్వు, నిర్మలమైన మనసు, సుతి మెత్తని వ్యక్తిత్వంతో అందరి మనసులు గెలిచి బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకున్నాడు.

Bigg Boss-4 : అభిజిత్‌ బిగ్‌బాస్-4 విజేతగా నిలిచినా.. ప్రైజ్‌మనీ మాత్రం తగ్గిపోయింది.. కారణం ఎంటో తెలుసా?
Follow us on

Bigg Boss-4 :  అభిజిత్ చూడ చక్కని రూపం, అందమైన నవ్వు, నిర్మలమైన మనసు, సుతి మెత్తని వ్యక్తిత్వంతో అందరి మనసులు గెలిచి బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకున్నాడు. అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ప్రశంసలు పొందుతూ ట్రోపిని అందుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అతడి బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ మాత్రం తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే..

మిస్టర్ కూల్ అభిజిత్ విజేత‌గా నిల‌వ‌గా అఖిల్ రన్నరప్‌తో స‌రిపెట్టుకున్నాడు. అయితే మూడో స్థానంలో ఉన్న సోహైల్ ఇచ్చిన ట్విస్టుతో అత‌డి ప్రైజ్‌మ‌నీ స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. సోహైల్ రూ.25 లక్షల డీల్‌కు అంగీక‌రించి స్వచ్ఛందంగా బిగ్‌బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అయితే అతడికిచ్చే ప్రైజ్ మనీ మొత్తం విన్నర్‌ ప్రైజ్‌మనీ నుంచే కట్ చేస్తారు. దీంతో అభిజిత్ బిగ్‌బాస్ విజేతగా నిలిచినా రూ.లక్షలు మాత్రమే గెలుచుకున్నాడు. కానీ స్టైలిష్ బైక్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. తను కంటెస్టెంట్ కావడం బిగ్‌బాస్ షోకు గర్వకారణమని హోస్టర్స్ అంటే లేదు బిగ్‌బాస్ షోనే తనకు గర్వకారణమని చెప్పుకొచ్చాడు మిస్టర్ కూల్.