West Bengal Elections: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ రేపు జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార సమయంలో తీవ్ర ఘర్షణలూ చెలరేగాయి.
కాగా, రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతలలో 135స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు 159. రేపు ఐదో విడతలో 45 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.
ఇక పోలింగ్ జరగనున్న 45 నియోజకవర్గాలు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పోలింగ్ లో పాల్గొనబోయే ఓటర్లు 1.12 కోట్లు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,789. 319 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థినుల సంఖ్య 39.
ఈ 45 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పార్టీల ఆధిక్యత.. గెలుచుకున్న స్థానాలు ఇలా ఉన్నాయి.
2019 లోక్ సభ ఎన్నికల్లో
బీజేపీకి 45 శాతం ఓట్లు రాగా.. బీజేపీ ఓట్ల ఆధిక్యత కనబర్చిన అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 22
టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్).. 41.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఓట్ల ఆధిక్యత కనబర్చిన అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 23
2016 అసెంబ్లీ ఎన్నికల్లో…
టీఎంసీ గెలుచుకున్న స్థానాల సంఖ్య 32
బీజీపీ ఒక్కటి కూడా లేదు.
కాంగ్రెస్- లెఫ్ట్ ఫ్రంట్ సంయుక్తంగా గెలుచుకున్న స్థానాల సంఖ్య 10