West Bengal Election 2021: పోలింగ్ రోజే ఇక్కడ ప్రచారమేంటి?… ప్రధాని మోదీపై మమతా బెనర్జీ ఫైర్

|

Apr 01, 2021 | 7:04 PM

West Bengal Polls 2021: పశ్చిమ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో అధికారిక పర్యటన చేపట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా తృణాముల్ కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. దీనికి సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసింది.

West Bengal Election 2021: పోలింగ్ రోజే ఇక్కడ ప్రచారమేంటి?... ప్రధాని మోదీపై మమతా బెనర్జీ ఫైర్
Mamata Banerjee
Follow us on

పశ్చిమ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ గత వారం బంగ్లాదేశ్‌లో రెండ్రోజుల అధికారిక పర్యటన చేపట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా తృణాముల్ కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. దీనికి సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపించారు. నందిగ్రామ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె…పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ (గురువారం) రెండో విడత పోలింగ్ జరుగుతున్న వేళ…ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు.

ప్రతిసారీ పోలింగ్ జరుగుతున్న రోజే నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎందుకు పర్యటిస్తున్నారని మమత ప్రశ్నించారు. పోలింగ్ రోజున ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ…దూరదర్శన్ తదితర వసతులను దుర్వినియోగం చేస్తున్నారని  ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనన్నారు. ప్రధాని మోదీ గురువారం జయ్‌నగర్, ఉలుబేరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్, యూపీలకు చెందిన బీజేపీ గూంఢాలు బెంగాల్ ఎన్నికలకు వచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. వారికి కేంద్ర బలగాలు అండగా నిలుస్తున్నాయని ధ్వజమెత్తారు. వారికి సహకరించాలని స్వయంగా కేంద్ర హోం మంత్రి కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్‌లను ఆదేశించారని ఆరోపణలు గుప్పించారు. అయితే పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఎన్నికల సంఘం మౌనపాత్ర పోషిస్తోందని విమర్శించారు. దీనిపై తాము ఎన్ని ఫిర్యాదు లేఖలు ఇచ్చినా…ఎన్నికల సంఘం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా బీజేపీ అభ్యర్థులకు సహకరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్‌తో తాను ఏం మాట్లాడానో బహిర్గతం చేయబోనన్నారు. ఇలాంటి ఎన్నికలను మునుపెన్నడూ తాను చూడలేదని మమతా బెనర్జీ విస్మయం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి..బెంగాల్‌లో బీజేపీదే హవా.. 200కు పైగా సీట్లు గెలుస్తాం.. జయానగర్ ప్రచారసభలో ప్రధాని మోదీ

TN Election 2021: డీఎంకే మహిళా వ్యతిరేక పార్టీ…ఓటింగ్ నాడు బుద్ధిచెప్పాలన్న అమిత్ షా