pm narendra modi in bengal: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం జోరందుకుంది. ఇందులోభాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జయానగర్‌లో జరిగిన సభలో భారీ ర్యాలీ పాల్గొన్న ఆయన బెంగాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో జరగుతున్నాయి. ఇప్పటివరకు ఒక దశ పూర్తి కాగా, ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతుంది. కాగా, మూడో దశ పోలింగ్ జరగనున్న జయనగర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితం జనం అనుకున్నారని, అయితే తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్టార్ట్ వచ్చిందని, ప్రజల గొంతుకు దేవుడి ఆశీస్సులు లభించినట్లు ప్రధాని తెలిపారు. బెంగాల్‌లో ఈసారి బీజేపీకి 200 కన్నా ఎక్కువే సీట్లు వస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇవాళ రెండవ దశ పోలింగ్ జరుగుతోందని, పోలింగ్ బూత్‌కు భారీ సంఖ్యలో ఓటర్లు వస్తున్నారని, ఎక్కడ చూసినా బీజేపీ మద్దతు లభిస్తుందన్నారు. బెంగాల్‌లో బీజేపీ హవా కొనసాగుతోందన్నారు. కూల్ కూల్ అని దీదీ అంటున్నారని, తృణమూల్ కూల్‌గా లేదని, అది శూలంగా మారిందని, ఆ శూలం వల్ల ప్రజలు విపరీతగా బాధపడుతున్నారని ప్రధాని ఆరోపించారు. జై శ్రీ రామ్ లాంటి నినాదాలతోనూ మమతా బెనర్జీ ఇబ్బందిపడుతోందన్నారు. దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేసినా, తిలకం దిద్దుకున్నా.. కాషాయ వస్త్రాలను చూసినా.. దీదీకి సమస్యగా మారిందన్నారు. దేశాభివృద్ధితో పాటు బెంగాల్ వెనుకబాటుతనం పోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.
Read Also… పోలింగ్ బూత్ నుంచే గవర్నర్‌కు ఫోన్ చేసిన సీఎం మమతా బెనర్జీ.. ఓట్లు వేయనివ్వడంలేదంటూ ఫిర్యాదు..!