ఈ నెల 27 న బెంగాల్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మొదటి దశలో 5 జిల్లాల్లో 30 సీట్లకు పోలింగ్ జరగనుంది . ఈ ఎన్నికల్లో జార్ గ్రామ్, మెదినీపూర్ (వెస్ట్ మిడ్నపూర్), రనిబుధ్ (బంకూరా), బాగ్ ముండి (పురూలియా), ఖేజూరీ (ఈస్ట్ మిడ్నపూర్) నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ స్థానాల్లో చాలా చోట్ల ముక్కోణపు పోటీ ఉంది. జార్ గ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన బీర్ బాహా హన్స్ డా, బీజేపీకి చెందిన సుఖ్ మయి సత్పతి, సీపీఎం నుంచి మధుజా సేన్ రాయ్ పోటీ చేస్తున్నారు. వీరిలో బీర్ బాహా నటి.. ఈమె కొన్ని చిత్రాల్లో నటించింది. మెదినీపూర్ లో టీఎంసీ నుంచి జాన్ మలయా, బీజేపీ నుంచి షమిత్ దాస్, సీపీఐ నుంచి తరుణ్ కుమార్ ఘోష్ పోటీ చేస్తున్నారు. వీరిలో నటుడైన జాన్ కొన్ని సినిమాల్లో నటించాడు. మెదినీపూర్..ఖరగ్ పూర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
రని బుధ్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఖుదీరాం తుడు, టీఎంసీ నుంచి జ్యోత్సా మండి, సీపీఎం నుంచి దెబ్లినా హెమ్ బ్రమ్ పోటీలో ఉండగా.. పురూలియా జిల్లాలోని బాగ్ మండి లో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పోటీ చేస్తోంది. దీనికి బీజేపీ మద్దతునిస్తుంది. ఈ విద్యార్ధి విభాగం నుంచి అశుతోష్ మెహతో, లెఫ్ట్ పార్టీల నుంచి దేబ్ రంజాన్ మెహతో, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుశాంత్ మెహతో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నేపాల్ చంద్ర మెహతో పోటీ చేస్తున్నారు.
ఖేజూరీలో టీఎంసీ తరఫున పార్థా ప్రతీప్ దాస్, బీజేపీ నుంచి సంతను ప్రముఖ్, లెఫ్ట్ పార్టీల తరఫున హిమాంశు దాస్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో చాలా భాగం వెనుకబడిన వర్గాల వారు ఉన్నారు. వీరి ఓట్లను తాము చేజిక్కించుగోగలమని ఏ పార్టీకి ఆ పార్టీ భావిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : నవీన్ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు..:warning to Naveen Polishetty Video.
ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video
వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.