ఈశాన్య భారతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. బెంగాల్‌లో 80.43శాతం, అసోంలో 74.79 శాతం నమోదు

|

Apr 01, 2021 | 7:59 PM

పశ్చిమ బెంగాల్‌, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

ఈశాన్య భారతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. బెంగాల్‌లో 80.43శాతం, అసోంలో 74.79 శాతం నమోదు
West Bengal And Assam Assembly Election 2021
Follow us on

Assembly elections 2021: పశ్చిమ బెంగాల్‌, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల వరకూ పశ్చిమ బెంగాల్‌లో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74.79శాతం పోలైనట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. భారతీయ జనతా పార్టీ , తృణమూల్‌ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరగగా సాయంత్రం 7గంటల వరకు 80.43శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ముఖ్యంగా మమతా, సువేందు అధికారి బరిలోఉన్న నందిగ్రామ్‌లోనూ భారీ స్థాయిలో ఓటింగ్‌ జరగడం విశేషం. నందిగ్రామ్‌ నియోజకవర్గంలో 80శాతం పోలింగ్‌ నమోదైననట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అత్యధికంగా కతూల్‌పూర్‌ నియోజకవర్గంలో 87శాతం ఓటింగ్‌ నమోదుకాగా, చంద్రకోనా, ఇండస్‌, పత్తార్‌ప్రతిమ నియోజకవర్గాల్లో 86శాతం ఓటింగ్‌ నమోదైంది.

అటు ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడ రెండో దశలో 39 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 7 గంటల వరకు 74.79శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నొవ్‌గాంగ్‌ నియోజక వర్గంలో అత్యధికంగా 83శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. బెంగాల్‌లో మొత్తం 294 నియోజకవర్గాలకు ఎనిమిది విడతల్లో, అసోంలో 126 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు సంబంధించి మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also….  మరోసారి నయనతారపై నోరు పారేసుకున్న రాధారవి.. కామెంట్స్‌పై కాలు రువ్వుతున్న తమిళనేతలు