
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి తమదే గెలుపని బీజేపీ అంటుంటే .. కర్నాటక ప్రజలు తమకు చారిత్రక విజయం అందిస్తారని కాంగ్రెస్ నమ్ముతోంది. అయితే, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోందని టీవీ 9తో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించింది. కానీ ప్రజలు నమ్మటం లేదన్నారు. ప్రజల బ్యాంకు ఖాతా (డీబీటీ) విధానాన్ని పెద్దఎత్తున తీసుకొచ్చామని, పారదర్శకతతో స్వచ్ఛమైన పాలన అందించామని చెప్పారు కేంద్ర మంత్రి.
బీఎస్ యడ్యూరప్ప నాయకత్వం లేని తొలి ఎన్నిక తమ పార్టీకి ఎంత పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు. మళ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే వరకు విశ్రమించబోనని యడ్యూరప్ప మా సీనియర్ నాయకుడు శపథం చేసి మరీ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయనకు ఇప్పుడు 80 ఏళ్లు. .అయినా మా అందరికంటే చురుకుగా, కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు.
DBT , పారదర్శకతను ఉపయోగించి తాము స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఇచ్చామన్నారు. యడ్యూరప్ప మా అందరికంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇదే మాకు కాంగ్రెస్‌కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను.. అందుకే పార్టీ కోసం ఎందుకు పనిచేయాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తారు. ఇక్కడ అలా కాదు. యడ్యూరప్ప ఎంతో కష్టపడి, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జోషి ఆనందం వ్యక్తం చేశారు.
బీజేపీ భయపడి టికెట్లు కేటాయించడం లేదన్న కాంగ్రెస్ ఆరోపణపై ఆయన స్పందిస్తూ.. ఎన్నికలకు ఇంత కాలం ముందు టిక్కెట్లు ఇవ్వడం గొప్ప ధైర్యమా..? మా లెక్క ప్రకారం టికెట్ ప్రకటిస్తాం. రెండు రోజుల్లో మొత్తం అసెంబ్లీలకు అభ్యర్థులకు టికెట్లు కూడా అందిస్తాని అన్నారు కేంద్ర మంత్రి జోషి.
మరిన్ని జాతీయ వార్తల కోసం