Priyanka Gandhi: గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:28 PM

త్వరలో ఉత్తర ప్రదేశ్‌తో సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో బీజేపీ పాలిత గోవా కూడా ఉంది. అయితే ఈసారి అక్కడ కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు కూడా

Priyanka Gandhi: గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రియాంక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Follow us on

త్వరలో ఉత్తర ప్రదేశ్‌తో సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో బీజేపీ పాలిత గోవా కూడా ఉంది. అయితే ఈసారి అక్కడ కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌లు ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారామె. తాజాగా ప్రియాంక మొర్పిర్ల అనే గ్రామంలో కలియ తిరిగారు. అక్కడి గిరిజన మహిళలతో కలిసి సరదాగా జానపద నృత్యం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా తలపై కుండ పెట్టుకుని ప్రియాంక డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను తమ అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది కాంగ్రెస్‌ పార్టీ.

ప్రియాంక గాంధీ కూడా ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్‌లో పంచుకుంది. ‘ నేను మోర్పిలాలో ఎమీలియా ఫెర్నాండెజ్ అనే ఓ గొప్ప జానపద నృత్య కళాకారిణిని కలిశాను. ఆమెతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు, గ్రామంలోని గిరిజనుల సంస్కృతి, జానపద నృత్యం, పచ్చదనం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎమీలియా గతంలో మా అమ్మమ్మ ఇందిరా గాంధీ, నాన్న రాజీవ్‌ గాంధీని కూడా కలిశారట’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చారు ప్రియాంక. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి.

Bipin Rawath-Ali Akbar: బిపిన్ మరణిస్తే నువ్వుతున్న ఎమోజీలు..మతాన్ని వదిలేస్తూ మలయాళ దర్శకుడి సంచలన నిర్ణయం

Facebook: ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మెటా లైవ్ చాట్ ఫీచర్‌!

The first Island: ప్రపంచంలో మొట్టమొదట సముద్రం నుంచి బయటకు వచ్చిన ద్వీపం మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?