UP Election Results: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘనత.. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండో సారి అధికారంలోకి..

ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రికార్డు సృష్టించింది. 37ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి విజయం సాధించింది. 1985 తరువాత తొలిసారిగా బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి...

UP Election Results: యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘనత.. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండో సారి అధికారంలోకి..
Up Bjp

Updated on: Mar 10, 2022 | 12:49 PM

ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రికార్డు సృష్టించింది. 37ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి విజయం సాధించింది. 1985 తరువాత తొలిసారిగా బీజేపీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలను కైవసం చేసుకుంది. యూపీలో బీజేపీ(BJP)ని వరుసగా రెండో సారి అధికారంలోకి తీసుకురావడంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలకపాత్ర పోషించారు. ప్రధాని మోడీ మేనియాకు యోగి ఇమేజ్ తోడు కావడంతో విపక్షాలు చేతులెత్తేశాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలన్న మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav), మాయావతి(Mayavathi)ల ఆశలు అడియాసలయ్యాయి. త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఏఏ పార్టీ ఏఏ సందర్భాల్లో వరుస విజయాలు సాధించిందో చూద్దాం.

  • – 1951, 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుస విజయం…
  • – 1967లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చిన భారతీయ క్రాంతిదళ్‌, సీఎంగా చరణ్‌సింగ్‌
  • -1969, 1974 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుస విజయం
  • -1980,1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుస విజయం
  • – 2017, 2022 ఎన్నికల్లో బీజేపీ వరుస విజయం

Results Updates: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లో మళ్లీ కమలం వికసించింది. అధికార పగ్గాలను తిరిగి కైవసం చేసుకుంది. భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మోడీ-యోగి ఆదిత్యనాథ్‌లు యూపీలో డంబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఆ ప్రచారానికి తమ ఓట్ల ద్వారా ప్రజలు ఆమోదం తెలిపారు. 35 ఏళ్ల తర్వాత అక్కడ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం విశేషం. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఆ రాష్ట్ర సీఎం కానున్నారు. మొత్తం 403 మంది సభ్యులతో కూడిన యూపీ అసెంబ్లీలో.. మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు. అధికార బీజేపీ 263 స్థానాల్లో అధిక్యంతో భారీ మెజార్టీ దిశగా దుసుకుపోతోంది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు యూపీ అధికార పీఠం అందని ద్రాక్షే అయ్యింది. సమాజ్‌వాది పార్టీ-ఆర్ఎల్డీ కూటమి 110 స్థానాల్లో ముందంజలో నిలవగా.. బీఎస్పీ 4 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాల్లో ముందంజలో నిలుస్తున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Also Read

Markets Rally: కాషాయ హవాతో పరుగులు తీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే పండగ..

Arasavelli: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్య కిరణాలు

Viral Photo: ఈ ఫోటోలోని భారత పారిశ్రామిక దిగ్గజం ఎవరో గుర్తుపట్టారా? మీ మెదడుకు మేత..