Breaking News
  • రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మద్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్న సిఎం. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను వివరించనున్న ముఖ్యమంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానం. పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
  • విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం. ఎల్జీ పాలిమర్స్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి. ఎన్జీటీ లో కేసు విచారణ నవంబర్ 3న ఉందని కోర్టుకు తెలిపిన ముకుల్ రోహత్గి. ఎన్జీటీలో కమిటీ నివేదికపై పది రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలన్న సుప్రీంకోర్టు. సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాల వరకు కేసు ఎన్జీటీలో విచారణను వాయిదా వేయాలని సూచించిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 16 వాయిదా.
  • శాసన మండలి : ఎమ్మెల్సీ గా ప్రమాణస్వీకారం కల్వకుంట్ల కవిత. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేసిన కవిత. హాజరయిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన స్థానిక సంస్థల ప్రతినిధులతో కవిత మర్యాదపూర్వక భేటీ.
  • చెన్నై: నటుడు రజినీకాంత్ ఆరోగ్యం ఫై, పార్టీ ఫై వస్తున్న ప్రచారాలపై ప్రకటన విడుదల చేసిన రజినీకాంత్ . నా ఆరోగ్యం ఫై సోషల్ మీడియా లో జరుగుతున్న వివాదం లో నిజం లేదు. నేను డాక్టర్లను కలిసిన మాట నిజమే . నా ప్రస్తుత ఆరోగ్యం ఫై వారి సలహాలు , సూచనలు తీసుకున్నాను . ఇప్పుడు రాజకీయాలు వద్దని , నా ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని వస్తున్న వార్తలపై త్వరలోనే వివరణ ఇస్తాను. నేను పార్టీ పెట్టడం ఫై , నా రాజకీయ ఆలోచనల గురించి నా అభిమానులకు నేను పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
  • అమరావతి: విశాఖ గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేతపై అప్పీల్ కు వెళ్లిన గీతం యాజమాన్యం. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు. వచ్చే సోమవారం రెగ్యులర్ కోర్టులో విచారణకి వాయిదా వేసిన న్యాయస్థానం. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న హైకోర్టు.
  • బిగ్ బాస్‌ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్‌. నాగార్జున కోరితేనే షో చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సామ్‌. 'గతంలో ఒక్క బిగ్‌ బాస్‌ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో. అందుకే మామగారు బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను. అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్‌'.
  • టిఎస్ ఎంసెట్లో 45 శాతం మార్కుల నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. TSEAMCET-2020 లో అర్హత సాధించిన విద్యార్థులను TS EAMCET (అడ్మిషన్స్) -2020 కౌన్సెలింగ్ కు హాజరుకావడానికి అనుమతి. 10 + 2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు TS EAMCET-2020 లో అడ్డంకిగా మారిన 45 శాతం మార్కుల నిబంధన. ఈ నిబంధన 2020- 21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తింపు. భవిష్యత్తులో 2021-22 సంవత్సరానికి ఈ నిబంధన వర్తించదు. శ్రీమతి చిత్రా రామచంద్రన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్.

రూ.122 కోట్లు ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

రుణాలు ఎత్తివేత కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ .122 కోట్ల విలువైన స్థిరమైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది.

ED Attaches Rs 122 crore DCHL Assets In Rs 8180 Crore Loan Fraud, రూ.122 కోట్లు ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

రుణాలు ఎత్తివేత కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ .122 కోట్ల విలువైన స్థిరమైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది. దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, దాని మాజీ ప్రమోటర్లు టీ వెంకట్రామ్‌ రెడ్డి, టీ వినాయక్‌ రవిరెడ్డి, వీరి బినామీ కంపెనీకి చెందిన రూ.122.15 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. రుణాల కుంభకోణం కేసులో న్యూఢిల్లీ, హైదరాబాద్‌, గురుగ్రామ్‌, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోని 14 ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ఈ ఆస్తులు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ విచారణ చేస్తున్న దివాలా కేసు పరిధిలో రాకపోవడంతో.. డీసీహెచ్‌ఎల్‌ ఆస్తులను అటాచ్‌ చేయడం ఇది రెండోసారి. దీంతో జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.264.56 కోట్లకు చేరింది. ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన దివాలా పరిష్కార ప్రణాళిక రూ.400 కోట్లు మాత్రమే ఉంది. డీసీహెచ్‌ఎల్‌, దాని ప్రమోటర్లు దాదాపు రూ.8,180 కోట్ల రుణాల కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ పేర్కొంది. డీసీహెచ్‌ఎల్‌ ప్రమోటర్లు ప్రణాళికబద్ధంగా ఆస్తులు, అప్పుల పట్టికలో అవకతవకలకు పాల్పడ్డారని, లాభాలను, ప్రకటనల ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపారని ఈడీ తమ నివేదికలో తెలిపింది.

అలాగే, రుణాలను తక్కువ చేసి చూపినట్లు, తద్వారా బ్యాంకులను, వాటాదారులను మోసం చేసినట్లు పేర్కొంది. దివాలా ప్రక్రియను ప్రారంభించినప్పటికీ.. ప్రమోటర్లు వారి కుటుంబ సభ్యులు పరోక్షంగా కంపెనీపై నియంత్రణను కొనసాగిస్తున్నారని, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతూ భారీ స్థాయిలో వేతనాలు పొందుతున్నారని ఈడీ తెలిపింది.

ఒక బ్యాంకు వద్ద తీసుకున్న రుణాన్ని మరో ఫైనాన్షియల్‌ సంస్థలకు తెలియకుండా దాచిపెట్టారని, గత కొన్నేళ్లుగా డీసీహెచ్‌ఎల్‌ రూ.15,000 కోట్లకు పైగా రుణాలను పొందినట్లు నిర్ధారించింది. నిర్వహణ మూలధనం కోసం తీసుకున్న రుణాలను బ్యాంకుల అనుమతి లేకుండా ఇతర ప్రాజెక్టులపై అనవసరంగా ఖర్చుతో కంపెనీని దివాలా తీయించారని, రుణాలను భారీ మొత్తంలో ఎటువంటి చట్టబద్ధమైన వ్యాపారం చేయని అనుబంధ సంస్థలకు మళ్లించిందని ఈడీ తెలిపింది.వివిధ ట్రస్టులకు అనుమానస్పద డొనేషన్లు చేసినట్లు చూపిందని.. ఇవి అనుమానస్పదంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది.

Related Tags