Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

ప్రభాస్‌తో ఇంతవరకు నటించని టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు కేవలం టాలీవుడ్‌లోనే కాదు ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజు ఉంది. ఆయన జీవితం, సినిమాలు గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ క్రేజ్ ఆయన ఒక్క రోజులో సంపాదించుకున్నది కాదు. రెబల్‌స్టార్ సినీ వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్‌కూ ‘సినిమా’ కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటితో ఏ మాత్రం డీలా పడని ప్రభాస్.. విభిన్న కథలను ఎంచుకుంటూ హిట్లను కొట్టి.. టాప్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం కూడా చాలానే ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు మరో చిత్రాన్ని ఒప్పుకోకుండా కేవలం బాహుబలికే సమయాన్ని కేటాయించాడు ప్రభాస్. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఏ స్టార్‌ హీరో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేందుకు సాహసించారు. అందుకే దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రభాస్‌‌కు మరిచిపోలేని హిట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు అసలు ప్రభాస్ లేకుంటే బాహుబలి ఉండేదే కాదంటూ ఆయన కితాబిచ్చాడు.

ఇదిలా ఉంటే దాదాపు 17ఏళ్లలో 19 చిత్రాల్లో నటించిన ప్రభాస్.. కొన్ని సార్లు హీరోయిన్లను రిపీట్ చేశారు. ముఖ్యంగా త్రిష, కాజల్, అనుష్క, తమన్నా, ఛార్మీలతో రెండు అంతకంటే ఎక్కువ చిత్రాల్లో కలిసి నటించారు ప్రభాస్. త్రిష మూడు చిత్రాల్లో(వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు), కాజల్ రెండు చిత్రాల్లో(మిస్టర్ పర్‌ఫెక్ట్, డార్లింగ్), అనుష్క నాలుగు చిత్రాల్లో (బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2), తమన్నా మూడు చిత్రాల్లో(రెబల్, బాహుబలి 1, 2 ), ఛార్మీ రెండు చిత్రాల్లో(పౌర్ణమి, చక్రం)ప్రభాస్‌తో రొమాన్స్ చేశారు. అలాగే నయనతార, అసిన్, ఇలియానా, కంగనా రనౌత్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా అతడితో ఆడిపాడారు. ముఖ్యంగా ఆయా సమయంలో టాప్ హీరోయిన్లుగా కొనసాగిన అందరూ కనీసం ఒక్క సినిమాల్లోనైనా ప్రభాస్‌తో జోడి కట్టారు. అంతెందుకు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే కూడా ప్రభాస్ తదుపరి చిత్రంలో నటిస్తోంది. అయితే ఇంతవరకు ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోని స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? సమంత అక్కినేని.

 

2010లో ఏ మాయ చేశావే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సమంత.. ఇప్పటి స్టార్ హీరోలందరితో దాదాపుగా కలిసి పనిచేసింది. ఇక మహేష్, నాగ చైతన్య, యన్‌టీఆర్‌లతో అయితే రెండుకు మించి సినిమాల్లో కనిపించింది. కానీ ఇంతవరకు ఆమె ప్రభాస్‌తో ఒక్కసారి కూడా రొమాన్స్ చేయలేదు. కనీసం అతడి చిత్రాల్లో కెమెరా అప్పియరెన్స్ కూడా ఇవ్వలేదు. టాలీవుడ్‌కు వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా ఇంతవరకు సమంత, ప్రభాస్‌తో జోడీ కట్టకపోవడం విశేషం. వారిద్దరికి అనువైన కథ దొరకలేదో..? లేక ప్రభాస్ కోసం దర్శకనిర్మాతలు సమంతను సంప్రదించలేదో తెలీదు గానీ ఈ ఇద్దరి కాంబోలో ఒక్క మూవీ కూడా లేదు. ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తోన్న సమంత.. ఈ మూవీ తరువాత మరే మూవీని ఒప్పుకోలేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే సమంత సినిమాలకు తాత్కాలికంగా గుడ్‌ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం అంటే కష్టమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక సమంతతో పాటు ఇప్పటి స్టార్ హీరోయిన్లు అయిన రకుల్, కీర్తి సురేష్ కూడా ప్రభాస్‌తో ఇంకా నటించలేదు. అయితే ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌లో తనకు ఛాన్స్ వచ్చిందని.. కానీ తరువాత కొన్ని కారణాల వలన ఆ మూవీ ఆఫర్ పోయిందని రకుల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక కీర్తి, ప్రభాస్ జోడి భవిష్యత్‌లోనైనా వస్తుందేమో చూడాలి.