DMart: డీమార్ట్ దుమ్మురేపింది… మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ.446.95 కోట్ల లాభం…

రిటైల్‌ వ్యాపార సంస్థ డీమార్ట్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదుర్స్ అనిపించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల...

DMart: డీమార్ట్ దుమ్మురేపింది... మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ.446.95 కోట్ల లాభం...
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2021 | 9:48 PM

DMart: రిటైల్‌ వ్యాపార సంస్థ డీమార్ట్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదుర్స్ అనిపించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.446.95 కోట్ల నికర లాభాన్ని పొందింది. కాగా గతేడాదితో పోలిస్తే డీమార్డ్ ఆదాయం మరింత పెరిగింది. నికర లాభం 16.39 శాతం మేర పెరిగినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ పేర్కొంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆపరేషన్స్‌ ద్వారా 10.77 శాతం వృద్ధితో రూ.7,542 కోట్ల ఆదాయం సముపార్జించినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,808.93 కోట్లు కావడం గమనార్హం. కాగా అదే సమయంలో రూ.6,977.88 కోట్లు ఖర్చులుగా కంపెనీ చూపించింది. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ నికర లాభం 19.27 శాతం వృద్ధితో రూ.470.25 కోట్లకు చేరగా.. ఆదాయం రూ.7,432.69 కోట్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కొవిడ్‌-19 అనంతరం ఊహించిన దానికంటే వినియోగం పెరిగిందని, పండగ అమ్మకాలు కలిసి రావడంతో కంపెనీ వ్యాపారం వృద్ధి చెందిందని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సీఈవో, ఎండీ నివెల్లీ నోరోన్హా ఫలితాలనుద్దేశించి అన్నారు.

Latest Articles
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా