Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేకు ‘ఎడ్డీ’ వెయ్యి కోట్లు ఎందుకిచ్చారంటే?

disqualified karnataka mla claims bs yediyurappa gave him rs. 1000 crores, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేకు ‘ఎడ్డీ’ వెయ్యి కోట్లు ఎందుకిచ్చారంటే?

తను సీఎం కావడానికి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎదియూరప్ప .. అనర్హత వేటు పడిన (మాజీ) ఎమ్మెల్యేను ‘ ప్రసన్నం ‘ చేసుకోవడానికి ‘ కోట్ల ‘ రూపాయల ‘ నజరానా ‘ ఇచ్చారట. నారాయణ గౌడ అనే ఆ సభ్యుడు తాజాగా తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కృష్ణరాజపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తాను…. తన ఈ ప్రాంత అభివృధ్ది కోసం రూ. 700 కోట్లు కేటాయించవలసిందిగా ఎదియూరప్ప నివాసానికి వెళ్లి కోరానని, అయితే ఇంతకన్నా ఎక్కువగానే.. రూ. 300 కోట్లు కలిపి మొత్తం వెయ్యి కోట్లు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని గౌడ తన సహచరులకు చెప్పారు. ఆ తరువాత ఆ హామీ నెరవేర్చారని తెలిపారు. ‘ అంతటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వడంలో తప్పులేదు కదా ? అందుకే సపోర్ట్ ఇచ్చాను ‘ అని అన్నారు. ఇలాగే మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే కి కూడా ఎదియూరప్ప సహాయం చేశారని, ఈ విషయాన్ని ఆ శాసన సభ్యుడు స్వయంగా చెప్పారని నారాయణగౌడ గుర్తు చేశారు. అయితే.. అనర్థత వేటు పడిన ఎమ్మెల్యేలతో తనకు సంబంధం లేదని ఎడ్డీ చెప్పడం విశేషం.disqualified karnataka mla claims bs yediyurappa gave him rs. 1000 crores, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేకు ‘ఎడ్డీ’ వెయ్యి కోట్లు ఎందుకిచ్చారంటే?
అయినా ఎదియూరప్ప ముఖ్యమంత్రి కావడానికి ముందే నారాయణగౌడ.. ఆయన ఇంటికి వెళ్లి తన నియోజకవర్గ అభివృధ్దికి కోట్ల సాయం చేయాలని కోరడంలోని మతలబు ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు. అప్పటికి ఎడ్డీ సీఎం కూడా కాదు. మరి..
‘ అనర్హ ‘ సభ్యుడికి ఒక్కసారిగా మూడు వందల కోట్లు ఎక్కువే ఇఛ్చి ‘ ప్రసన్నం ‘ చేసుకోవడంలోని ఔచిత్యమేమిటన్నది తెలియాల్సి ఉంది.

Related Tags