స్నేహితుడి మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన డైరెక్ట‌ర్ సుకుమార్…

తనకి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ను మ‌రణించ‌డంతో ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ షాకింగ్ న్యూస్.. సుకుమార్ ను తీవ్రంగా క‌లిచివేసింది. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌.. సుకుమార్ స్నేహితుడు, మేనేజరే కాకుండా ‘అమరం అఖిలం ప్రేమ’ అనే చిత్రానికి నిర్మాత కూడా. సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ కూడా ఒకరు. శనివారం మధ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. ఎప్పుడు డిజప్పాయింట్‌కి లోనైనా.. తన మిత్రుడు […]

స్నేహితుడి మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన డైరెక్ట‌ర్ సుకుమార్...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 29, 2020 | 7:27 PM

తనకి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ను మ‌రణించ‌డంతో ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ షాకింగ్ న్యూస్.. సుకుమార్ ను తీవ్రంగా క‌లిచివేసింది. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌.. సుకుమార్ స్నేహితుడు, మేనేజరే కాకుండా ‘అమరం అఖిలం ప్రేమ’ అనే చిత్రానికి నిర్మాత కూడా. సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ కూడా ఒకరు. శనివారం మధ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. ఎప్పుడు డిజప్పాయింట్‌కి లోనైనా.. తన మిత్రుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌తో మాట్లాడితే మళ్లీ ఎనర్జీ వచ్చేదని, అంతగా తన లైఫ్‌లో ప్రసాద్ కీల‌క‌ పాత్ర పోషించారని సుకుమార్ తెలియజేశారు. ఆయన మరణం తనకి తీర‌ని లోటని, ప్ర‌సాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సుకుమార్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.