Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

నేను ఆకలితో ఉన్నపుడు ఏ హీరో పట్టించుకోలేదు – పూరి జగన్నాధ్

Puri Jagannadh Comments On Ismart Shankar Success, నేను ఆకలితో ఉన్నపుడు ఏ హీరో పట్టించుకోలేదు – పూరి జగన్నాధ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గత వారం విడుదలై అన్ని సెంటర్లలోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బీసీ సెంటర్ల ప్రేక్షకులైతే ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే పూరి తాజాగా టీవీ9 దిల్ సే ప్రోగ్రాంకు ఇంటర్వ్యూ ఇస్తూ.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

లైఫ్‌లో ఫస్ట్ టైం…

నాకు సరైన హిట్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. అందుకే ఈ సినిమా ఫలితం గురించి ఎంతగానో కంగారుపడ్డాను. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నాను. అంతేకాకుండా లైఫ్‌లో ఫస్ట్ టైం హిట్ కావాలని దేవుడిని బలంగా కోరుకున్నానని పూరి జగన్నాధ్ వెల్లడించాడు.

నేను ఆకలితో ఉన్నపుడు ఏ హీరో పట్టించుకోలేదు…

కెరీర్‌లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఎన్నో ప్లాప్స్ ఎదురుకున్నా.. ఆ టైంలో నాకు తోడుగా నా ఫ్యామిలీ తప్ప.. ఎవరూ కూడా నన్ను ఆదుకోవడానికి ముందుకు రాలేదని పూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క హీరో కూడా తనను పట్టించుకోలేదని అన్నారు. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో చాలా ఖంగారు పడ్డానని.. ఖచ్చితంగా హిట్ రావాలని కోరుకున్నాను.. ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూసిన తర్వాతే నాకు రీలీఫ్ వచ్చిందని పూరి జగన్నాధ్ వెల్లడించాడు.

ఇలా ఆయన చెప్పిన మరిన్ని విషయాలు.. త్వరలో తీయబోయే చిత్రాల గురించి ఆయన మాటల్లోనే…

 

 

Related Tags