కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న చిరు, బాలయ్య, వెంకీ

ప్రముఖ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి సోమవారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో గత రాత్రి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు […]

కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు.. పాల్గొన్న చిరు, బాలయ్య, వెంకీ
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 10:34 AM

ప్రముఖ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి సోమవారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో గత రాత్రి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు. కాగా 1980లో సంధ్య అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోదండరామిరెడ్డి దాదాపు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జునకు గుర్తుండిపోయే హిట్లను ఆయన ఇచ్చారు.