‘అసురన్’ రీమేక్‌కు దర్శకుడు ఫిక్స్..?

ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన ‘అసురన్’ తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇప్పుడు దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి.. ‘అసురన్’ రీమేక్‌కు దర్శకత్వం […]

'అసురన్' రీమేక్‌కు దర్శకుడు ఫిక్స్..?
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 11:02 AM

ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన ‘అసురన్’ తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇప్పుడు దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి.. ‘అసురన్’ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ‘అసురన్’ చిత్రం పూర్తి భావోద్వేగాలతో వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. హను అలాంటి సన్నివేశాలను బాగా తెరకెక్కించగలడని భావించిన నిర్మాతలు… అతడిని సంప్రదించి, ఓకే చెప్పించారని సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి ‘వెంకీమామ’లో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పాయల్, రాశిఖన్నా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.