Breaking News
  • చైనీస్ గేమింగ్ కేసుల్లో కొత్త కోణాలు . గేమింగ్ లో బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు . ఎస్ఆర్ నగర్ లో 6 లక్షలు , అదిలాబాద్ లో 15 లక్షలు పోగొట్టుకున్న యువకుడు సూసైడ్ . తాము కూడా లక్షలు పోగొట్టుకున్నామని సైబర్ క్రైమ్ కు క్యూ కడుతున్న బాధితులు . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్స్ ఫై సైబర్ క్రైమ్ పొలిసుల విచారణ . టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ ల ద్వారా వస్తున్న రిఫెరల్ కోడ్ , ప్రెడిక్షన్ ల ఫై కేసు నమోదు చేయనున్న సైబర్ క్రైమ్ పోలీసులు . చైనా దేశస్థుడు యాహువో, దిల్లీకి చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌, నీరజ్‌ లను కస్టడీ తీసుకోనున్న పోలీసులు . బెట్టింగ్ యాప్ లో ద్వారా 110 కోట్లు వసూళ్లు . పెమా , మని ల్యాండరింగ్ జరిగినట్టు ప్రాధమిక అంచనా . కంపెనీ డైరెక్టర్ ల లావాదేవీ ల ఫై ఈడీ కి లేక రాయనున్న సీసీఎస్ పోలీసులు.
  • చెన్నై : ప్రముఖ నటి నిక్కీగల్రనికి కరోనా సోకినట్టు నిర్ధారణ . తెలుగు తమిళ్ మలయాళం లో పలు చిత్రాలలో నటించిన నటి నిక్కీగల్రని. తనకు వైద్యపరీక్షల అనంతరం కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారని , ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తన ట్విట్టర్ లో వెల్లడి
  • తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం . తెలగాణలో 4259 మంది పోలీసులకు కరోనా . ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో 1946 మంది పోలీస్ ల కి కరోనా . తెలంగాణ వ్యాప్తం గా కరోనా తో 39 మంది పోలీసులు మృతి . హైద్రాబాద్ కమీషనరేట్ లిమిట్స్ లో 26 మంది మృతి . పోలీస్ కరోనా కేసుల్లో హైద్రాబాద్ తర్వాత వరంగల్ , రాజన్న సిరిసిల్ల , నల్గొండ లో పోలిసులకు ఎక్కువ కరోనా కేసులు.
  • అమీన్పూర్ అనాధ ఆశ్రమంలో.. మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో కొత్త కోణం. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. మరోమైనర్ బాలికపై సైతం నిందితుడు వేనుగోపాల్ లైంగికదాడి. కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాకుల బెదిరింపులు. ఆలస్యంగా వెలుగులోకి మారుతీ అనాధ ఆశ్రమ ఆగడాలు. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంభందాలు. జిల్లా చెల్డ్ వెలిఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలు. లాక్డౌన్ సమయంలో రెస్కూచేసిన మైనర్లను ఇక్కడికే పంపాలనీ సిబ్బందిపై ఒత్తిడి. కమిటీ సమావేశాలకు సైతం నేరూగా హాజరైన నిందితుడు వేణుగోపాల్. హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి వస్తున్న మారుతీ అనాధ ఆశ్రమం ఆగడాలు. అనాధ ఆశ్రమంలోని 70మందిని విచారించనున్న అధికారులు. రాష్ట్రం లోని ఇతర అనాధ ఆశ్రమలాల్లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 400ఆశ్రమాలు,19వేల మంది అనాధలు.
  • టాలీవుడ్ లో మరో పొలిటికల్ డ్రామా ఫిల్మ్ రూపొందుతోంది. నారా చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల స్నేహాన్ని, రాజకీయ శతృత్వాన్ని తెరకెక్కిస్తున్నారు. "ఇంద్రప్రస్థం" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కు దర్శకుడు దేవా కట్టా. రీసెంట్ గా కథా చౌర్యం వివాదంలో పడిన ఈ కథ ఇప్పుడు టాక్ ఆప్ ద టాలీవుడ్.
  • మర్డర్ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత వేసిన పిటిషన్ పై ఇవాళ నల్గొండ SC, ST కోర్టులో విచారణ.
  • స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను కస్టడీ కి కోరుతు కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. ముగ్గురు నుండి మరికొన్ని విషయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీ కి ఇవ్వాలని విజయవాడ 3rd ఏసిఎమ్ఎమ్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్న నిందితుల తరుపున న్యాయవాది.

దీపికా పడుకొనే ‘చపాక్‌’ మూవీ రివ్యూ

A young woman tries to rebuild her life after a man throws acid in her face, దీపికా పడుకొనే ‘చపాక్‌’ మూవీ రివ్యూ

సినిమా: చపాక్‌
దర్శకత్వం: మేఘనా గుల్జార్‌
నిర్మాణం: ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, దీపికా పదుకోన్‌, గోవింద సింగ్‌ సాందు, మేఘనా గుల్జార్‌
రచన: అతికా చౌహాన్‌, మేఘనా గుల్జార్‌
నటీనటులు: దీపికా పడుకోన్‌, విక్రాంత్‌ మాసే, విశాల్‌ దహియా, అంకిత్‌ బిష్ట్ తదితరులు
సంగీతం: శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌
కెమెరా: మలాయ్‌ ప్రకాష్‌
ఎడిటింగ్‌: నితిన్‌
విడుదల: జనవరి 10, 2020

సొసైటీలో సెలబ్రిటీలు అడ్రస్‌ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో ప్రథమ వరుసలో ఉండేవి స్త్రీలపై జరిగే అకృత్యాలు. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం కూడా సమాజానికి చెప్పాల్సిందే. ఆ పనికి నడుంకట్టారు మేఘనా గుల్జార్‌. యాసిడ్‌ బాధితురాలిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించడానికి సై అన్నారు దీపికా. ఈ సినిమాకు ఆమె ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద సంక్రాంతి జోరు మొదలైన తరుణంలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? ఏం చెప్పింది? ఎలా చూపింది? చదివేద్దాం

కథ:
మాలతి (దీపికా పదుకోన్) స్కూల్లో చదువుకునే అమ్మాయి. అప్పుడప్పుడే అబ్బాయిలతో పరిచయాలు పెరిగే పరువంలోకి అడుగుపెడుతుంది. అప్పటిదాకా కలిసి మెలిసి తిరిగిన వారు కూడా ఆమెను కొత్తగా చూడటం మొదలుపెడతారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ బబ్బూ (విశాల్‌ దహియా) ఓ సందర్భంలో తనను ‘అన్నా’ అని పిలవొద్దని అంటాడు. అంతే కాదు… ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడతాడు. దానికి ఆమె ఒప్పుకోదు. పైగా అతని ఫోన్లకు స్పందించడం మానేస్తుంది. దానికి తోడు తనకు నచ్చిన రాజేష్‌ (అంకిత్‌ బిష్ట్ )తో సన్నిహితంగా ఉంటుంది. అది నచ్చని బబ్బూ ఒకసారి ఆమెను మందలిస్తాడు. కానీ ఆమె బెదరదు. దాంతో తన వదిన సాయంతో మాలతిపై యాసిడ్‌ అటాక్‌ చేస్తాడు. మాలతి ముఖం పూర్తిగా కాలిపోతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఇచ్చిన భరోసాతో ఆమె ఓ సోషల్‌ యాక్టివిస్ట్ గా మారుతుంది. ఆ క్రమంలోనే అమోల్‌ (విక్రమంత్‌ మాసే)తో అనుబంధం పెరుగుతుంది. అతని పట్ల ఆమెకు ఒన్‌సైడ్‌ లవ్‌ మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆమెపై దాడి చేసిన బబ్బూకి శిక్ష పడిందా? అతని వదిన ఎందుకలా చేసింది? అమోల్‌ మనసు మాలతి ప్రేమను గ్రహించిందా? వారిద్దరి జీవితాలు ఎలా మారాయి? వంటివన్నీ ఆసక్తికరం.

 

సమీక్ష:
యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. యాసిడ్‌ బాధితురాలిగా దీపిక పడుకోన్ చాలా బాగా నటించారు. స్కూల్‌ స్టూడెంట్‌గా, అప్పుడప్పుడే ప్రేమలో పడిన అమ్మాయిగా మెప్పించారు. కాలిన గాయాలతో కనిపించే మేకప్‌ కూడా చాలా బాగా సూట్‌ అయింది. డీ గ్లామరైజ్డ్ రోల్‌లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు తప్పక నచ్చితీరుతుంది. సన్నివేశాలను కూడా చాలా నేచురల్‌గా రాసుకున్నారు. మేఘన ఈ స్క్రిప్ట్ ను డీల్‌ చేసిన విధానం బావుంది. మరీ ముఖ్యంగా 19 ఏళ్ల అమ్మాయి ఫీలింగ్స్ కి ముఖం, అందం వంటివన్నీ అడ్డు కావని చిన్న చిన్న డైలాగులతో బాగా చెప్పారు. ‘నా అంతట నేను ప్రేమించుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి’ అంటూ అమోల్‌ని మాలతి ప్రశ్నించే తీరు బావుంటుంది. దీపిక పడుకోన్‌ లిప్‌ లాక్‌ చేసిన సన్నివేశం క్లైమాక్స్ లో ఎమోషన్‌ని పండించింది. ఎంత కలిసిమెలిసి తిరిగిన వారినైనా ఓ కంట కనిపెడుతూ ఉండాలని, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని సమాజానికి ఓ సూచన ఇవ్వడానికి ఈ సినిమా పెద్ద ఉదాహరణ. సందర్భోచితంగా వచ్చే పాటలు, అందులో సాహిత్యం కూడా ఆకట్టుకుంటాయి. ఆత్మవిశ్వాసం ముందు అందం చిన్నబోతుందని చెప్పకనే చెప్పిన సబ్జెక్ట్. ఎప్పుడూ ఫ్లాష్‌ లైట్ల మధ్య అందంగా కనిపించే నటీనటులు అప్పుడప్పుడూ సమాజంలో జరిగే ఇలాంటి అంశాలను అడ్రస్‌ చేయడం వల్ల ఒకరకంగా అవగాహన కల్పించిన వారవుతారన్నది వాస్తవం.

ఫైనల్‌గా… చపాక్‌.. అడ్రస్‌ చేయాల్సిన అంశం!

డా. చల్లా భాగ్యలక్ష్మి

Related Tags