ధోనినే బెస్ట్‌ ఫినిషర్: మిల్లర్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్  ధోనిపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ధోని నాయకత్వాన్ని, అతడి కీపింగ్ టెక్నిక్స్, శాంతంగా ఉండే స్వభావాన్ని అందరూ ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు.

ధోనినే బెస్ట్‌ ఫినిషర్: మిల్లర్‌
Follow us

|

Updated on: Sep 14, 2020 | 6:07 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్  ధోనిపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ధోని నాయకత్వాన్ని, అతడి కీపింగ్ టెక్నిక్స్, శాంతంగా ఉండే స్వభావాన్ని అందరూ ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ధోని టాలెంట్ ఉటంకిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఓ మీడియా చానెల్‌లో మిల్లర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ధోని గుడ్‌బై చెప్పినప్పటికి ఐపీఎల్‌ 2020లో ఆయన మెరుపులను ధోని ఫ్యాన్స్, క్రికెట్‌ ప్రేమికులు  చూడవచ్చని తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికి ధోనియే బెస్ట్‌ ఫినిషర్‌ అని అభిప్రాయపడ్డాడు. గ్రౌండ్‌లో ఆయన ప్రదర్శించే స్కిల్స్ క్రికెటర్లందరికి ఆదర్శమన్నాడు. ఎటువంటి పరిస్థితినైనా తన అధీనంలోకి తెచ్చుకోవడం ధోనికే సాధ్యమని పేర్కొన్నాడు.

దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఉంటుందని.. కానీ ధోని ప్రశాంతంగా ఆ ఒత్తిడిని ఎదుర్కునే తీరు దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేర్చిందని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో  కింగ్స్‌ లెవన్‌ పంజాబ్ తరపున మిల్లర్, ప్రస్తుత ఐపీఎల్‌2020లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలో దిగనున్నాడు.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

వివేకా హత్య కేసు లేటెస్ట్ అప్డేట్

యాంకర్ సుమ ఎమోషనల్