Crime News : అప్పు ఇద్దరు స్నేహితులమధ్య చిచ్చు రేపింది.. చివరకు ఒకరిని దారుణంగా హత్య చేసేందుకు దారి తీసింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. థానే జిల్లా, ఉల్హాస్‌నగర్‌కు చెందిన సోను, ఫాహిమ్ ఓ జీన్స్ తయారీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఫాహిమ్, సోను దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకున్నాడు.
అయితే తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో సోను పలుసార్లు అడిగి చూసాడు. దాంతో ఇద్దరిమధ్య తరచు గొడవలు అవుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో సహనం నశించిన సోను, ఫాహిమ్‌ను హత్య చేశాడు. స్థానికులనుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Valentine’s Day Gift : టాటా పేరుతో డేటా దోపిడీ.. ప్రేమికుల రోజు బహుమతంటూ సైబర్ కేటుగాళ్ల మాయాజాలం