రియాద్ నుంచి వచ్చిన మహిళా ప్యాసింజర్.. అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులు షాక్..

|

Feb 09, 2023 | 8:55 PM

గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించిన వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ నిత్యం దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. స్మగ్లింగ్‌ కోసం అక్రమార్కులు ఎంచుకునే మార్గాలు చూస్తుంటే...

రియాద్ నుంచి వచ్చిన మహిళా ప్యాసింజర్.. అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులు షాక్..
Representative Image
Follow us on

గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించిన వార్తలు నిత్యం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ నిత్యం దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. స్మగ్లింగ్‌ కోసం అక్రమార్కులు ఎంచుకునే మార్గాలు చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా కేరళకు చెందిన ఓ మహిళ చేసిన పని తెలిస్తే మరీ ఇంత దిగజారాలా అనిపించకమానదు.

ఇంతకీ విషయమేంటంటే.. రియాద్‌ నుంచి వచ్చిన ఓ మహిళ కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయంలో దిగింది. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వెళ్లే సమయంలో గ్రీన్‌ ఛానల్‌ గుండా వెళ్లేందకు ప్రయత్నించడంతో కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించారు. ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ చేయాలని అధికారులు కోరారు. దీంతో ఆమె బదులిస్తూ.. తాను పీరియడ్స్‌లో ఉన్నానని ఫిజికల్‌ టెస్ట్‌కు సహకరించనని తెలిపింది. అయితే ఆమె మాటలు నమ్మని మహిళా అధికారులు పరీక్షించగా.. ఆమె రహస్య ప్రాంతంలో ఐదు బంగారు బిస్కెట్లను దొంగతనంగా తీసుకొచ్చింది. ఈ బంగారం ధర సుమారు రూ. 30 లక్షలు.

అయితే ఈ సమయంలో ఆ మహిళ అధికారులను బురిడి కొట్టించడానికి కృత్రిమంగా రుతుక్రమాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది. బంగారాన్ని శానిటరీ న్యాప్కిన్‌లో దాచుకొని, రుతుక్రమం భావన కలిగేందుకు నాప్‌కిన్‌కు ఎరుపు రంగును అద్దింది. ఈ విషయం తెలిసిన అధికారులు ఒక్కసారిగా స్టన్‌ అయ్యారు. ఇక గోల్డ్‌ స్మగ్లింగ్‌ కోసం మరి ఇంత దిగజారడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..