
కాకినాడలో దారుణం జరిగింది. భర్తకు బ్లాక్ ఫంగస్ సోకింది అని తెలయడంతో భార్య కుదేలైంది. ఆందోళనతో ఏం చేయాలో తెలియని పరిస్థితికి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతికి కొవిడ్ సోకింది. చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. ఈ నెల 19 నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ రావడంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. భర్తతోపాటు ఆమె కూడా అక్కడే ఉంటోంది. అయితే భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో ఆందోళనకు గురైంది.
అంతేకాకుండా మనోధైర్యం కూడా కోల్పోయింది. ఆమె భర్త బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతుండటం… ఆయనతో పాటు ఉన్న భార్య బుల్లిమావతి మనస్తాపంతో ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఈ ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ అక్కడే ఉన్న కొందరు బాధిత కుటుంబ సభ్యులు చూసి ఆస్పత్రి సిబ్బందికి చెప్పడంతో వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.