Viral Video: జువైనల్‌ హోమ్‌ గేట్లు బద్దలు కొట్టి పారిపోయిన మైనర్స్… పిల్లల బీభత్సానికి చేతులెత్తేసిన సెక్యూరిటీ

నేరాలకు పాల్పడిన మైనర్‌ పిల్లలను జువైనల్‌ హోమ్‌కు తరలిస్తుంటారు. జైలుశిక్ష వంటి కఠిన శిక్షలు అమలు చేయకుండా వారిని జువైనల్‌ హోమ్‌లో ఉంచి నేరప్రవృత్తిని మార్చుకునేలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏది మంచి, ఏది చెడు తెలుసుకుని సత్ప్రవర్తన అలవాటు చేసుకునే అవకాశం వారికి లభిస్తుంటుంది. అయితే ఇలా నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్...

Viral Video: జువైనల్‌ హోమ్‌ గేట్లు బద్దలు కొట్టి పారిపోయిన మైనర్స్... పిల్లల బీభత్సానికి చేతులెత్తేసిన సెక్యూరిటీ
Boys Escaped Froj Juvainal

Updated on: Apr 03, 2025 | 7:36 PM

నేరాలకు పాల్పడిన మైనర్‌ పిల్లలను జువైనల్‌ హోమ్‌కు తరలిస్తుంటారు. జైలుశిక్ష వంటి కఠిన శిక్షలు అమలు చేయకుండా వారిని జువైనల్‌ హోమ్‌లో ఉంచి నేరప్రవృత్తిని మార్చుకునేలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏది మంచి, ఏది చెడు తెలుసుకుని సత్ప్రవర్తన అలవాటు చేసుకునే అవకాశం వారికి లభిస్తుంటుంది. అయితే ఇలా నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకుని పారిపోయారు. గేట్లు పగులగొట్టి పారిపోతున్న విజువల్స్‌ సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.

జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చైబాసాలోని జువెనైల్ హోమ్‌లో రిమాండ్‌లో ఉన్న బాలురు పారిపోయారు. జువైనల్‌ హోమ్‌ నుంచి పిల్లలు తప్పించుకునే ముందు అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పగలగొట్టారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని ఉడాయించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో 21 మంది పిల్లలు తప్పించుకుని పోయారు. గుంపుగా మెయిన్‌ గేట్‌ను తోసుకుని బయటకు వచ్చారు. కొందరు బాలురు కర్రలు చేతపట్టి హల్‌చల్‌ చేశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలతోపాటు పలు వస్తువులను ధ్వంసం చేశారు. రహదారి వద్దకు చేరుకుని అటు నుంచి అటే చెక్కేశారు.

అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది పిల్లలను అడ్డుకోలేక చేతులెత్తేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. నలుగురు పిల్లలను అదుపులోకి తీసుకుని తిరిగి జువైనల్‌ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ స్పందిస్తున్నారు. పోలీసుల వైఫల్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

వీడియో చూడండి: