Woman Dead Body: కారులో నుంచి తోసేశారు.. కారు ఎవరిది.. ఆ మహిళ ఎవరు.. కర్నాటకలో ఇప్పుడు ఇదే సస్పెన్స్..

|

Sep 08, 2021 | 12:58 PM

నడిరోడ్డుపై మహిళ డెడ్‌బాడీ.. కారులో నుంచి తోసేశారు.. కారు ఎవరిది ? ఆ మహిళ ఎవరు ? తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులకు ఓ మహిళ హత్య కేసు సవాల్‌గా మారింది...

Woman Dead Body: కారులో నుంచి తోసేశారు.. కారు ఎవరిది.. ఆ మహిళ ఎవరు.. కర్నాటకలో ఇప్పుడు ఇదే సస్పెన్స్..
Dead Body
Follow us on

నడిరోడ్డుపై మహిళ డెడ్‌బాడీ.. కారులో నుంచి తోసేశారు.. కారు ఎవరిది ? ఆ మహిళ ఎవరు ? తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులకు ఓ మహిళ హత్య కేసు సవాల్‌గా మారింది. అసలు మహిళను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారని ఆరా తీస్తున్నారు పోలీసులు. కోయంబత్తూర్ చిన్నిపాలయం సమీపంలోని హైవే పై ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కారులో వెళ్తూ నడిరోడ్డుపై విసిరేశారు. సీసీటీవీలో కూడా ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

ఆ మహిళకు 45 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. రోడ్డుపై ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో ఆమెను హత్య చేసి హైవే పై విసిరేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

అసలు ఎవరా మహిళ ? ఎవరు ఆమెను హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారు ? నడిరోడ్డు మీద పడేయడానికి కారణం ఏంటి ? ఆ మహిళకు ఎవరైనా శత్రువులున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరులోని పీలమేడు పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు