ప్రేమించాలంటూ యువతికి తాళికట్టిన పోకిరీ

|

Dec 11, 2019 | 4:26 PM

తమిళనాడులో ఓ యువకుడు ప్రేమ పేరుతో రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి తనను తిరస్కరించినా వదలకుండా వెంటపడ్డాడు. చివరకు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో..తాళిని జేబులో పెట్టుకుని తననే ఫాలో అయ్యాడు. అవకాశం రాగానే బలవంతంగా ఆమెకు తాళిని కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని సాండ్రోర్‌ కుప్పంలో సంచలనంగా మారింది. ఆంబూరు గ్రామానికి చెందిన యువతి కాలేజీ చదువుల కోసం వాణియంబాడికి బస్సులో వెళ్తోంది. సాండ్రోర్‌ కుప్పం గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు కొంత కాలంగా ఆ […]

ప్రేమించాలంటూ యువతికి తాళికట్టిన పోకిరీ
Follow us on
తమిళనాడులో ఓ యువకుడు ప్రేమ పేరుతో రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి తనను తిరస్కరించినా వదలకుండా వెంటపడ్డాడు. చివరకు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో..తాళిని జేబులో పెట్టుకుని తననే ఫాలో అయ్యాడు. అవకాశం రాగానే బలవంతంగా ఆమెకు తాళిని కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని సాండ్రోర్‌ కుప్పంలో సంచలనంగా మారింది.
ఆంబూరు గ్రామానికి చెందిన యువతి కాలేజీ చదువుల కోసం వాణియంబాడికి బస్సులో వెళ్తోంది.
సాండ్రోర్‌ కుప్పం గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు కొంత కాలంగా ఆ యువతిని ప్రేమిస్తున్నానని వేధించేవాడు. తన ప్రేమను అంగీకరించమనేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు వివాహం నిశ్చమైన విషయాన్ని తెలుసుకున్న జగన్ ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. బస్సులో వెళ్తున్న సమయంలో  తన వెంట తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో బలవంతంగా కట్టాడు. అతడి చర్యను ఏ మాత్రం ఊహించని ఆ యువతి షాక్‌లో ఉండిపోయింది. వెంటనే తేరుకుని గట్టిగా కేకలు వేయటంతో డ్రైవర్‌ బస్సును నిలుపుచేశాడు. దీంతో బస్సులోని వారంతా అతన్ని పట్టుకుని దేహాశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.