Drugs: పోలీస్ అప్పీల్.. గంజాయి, గుట్కా, జర్దా, మారక ద్రవ్యాలు అమ్మితే సమాచారం ఇవ్వండి

|

Oct 24, 2021 | 11:40 AM

డ్రగ్‌ ఫ్రీ తెలంగాణ లక్ష్యమంటూ సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడంతో హైదరాబాద్‌లో స్పెషల్‌ టీమ్‌లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.

Drugs: పోలీస్ అప్పీల్.. గంజాయి, గుట్కా, జర్దా, మారక ద్రవ్యాలు అమ్మితే సమాచారం ఇవ్వండి
Drug Meterial
Follow us on

Telangana police Open appeal: డ్రగ్‌ ఫ్రీ తెలంగాణ లక్ష్యమంటూ సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడంతో హైదరాబాద్‌లో స్పెషల్‌ టీమ్‌లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మత్తు ముఠాలకు ముకుతాడు వేస్తున్నాయి. ఒకే రోజు రెండు డ్రగ్ ముఠాల ఆట కట్టించాయి. హైదరాబాద్‌లో ఓ కొరియర్ ఆఫీస్‌లో 3 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తుండగా సీజ్ చేశారు. చెన్నైవాసి దాన్ని పార్శిల్ చేసినట్లు గుర్తించిన NCB అధికారులు ఆ సమాచారం ఆధారంగా చెన్నైలో డ్రగ్స్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. తాజా పరిణామాలను గమనిస్తే.. అనుమానాలే నిజమవుతున్నట్లు స్పష్టం అవుతోంది. సందేహాలపై క్లారిటీ వస్తోంది.

హైదరాబాద్‌ శివారు కాలేజీలు, స్టూడెంట్సే లక్ష్యంగా ముఠాలు డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు నిఘా పెంచడంతో మేడ్చల్‌లో భారీగా డ్రగ్స్‌ దొరికాయి. రెండు కోట్ల విలువైన మెపిడ్రెన్ స్వాధీనం చేసుకున్నారు. 4.92 కేజీల డగ్ర్‌తో పాటు కారు సీజ్ చేశారు. పవన్, మహేష్ రెడ్డి, రామకృష్ణ గౌడ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్ సప్లై చేస్తున్న ముగ్గురు పట్టబడగా.. మరో ఇద్దరు నిందితులు ఎస్కే రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. వారి కోసం వేట సాగుతోంది.

ఇక, కూకట్‌పల్లిలో పవన్ వద్ద 4 గ్రాముల డ్రగ్‌ పట్టుకోగా.. విచారణలో అతడిచ్చిన సమాచారం ఆధారంగా మేడ్చల్ వద్ద కన్నా మహేశ్వరెడ్డి దగ్గర 926 గ్రాములు డ్రగ్స్‌ పట్టుకున్నారు. అతడిని విచారించగా నాగర్ కర్నూల్ వద్ద రామకృష్ణ గౌడ్ వద్ద కారులో 4 కేజీల మెపిడ్రిన్‌ దొరికింది. విద్యార్థులకు సప్లై చేయడానికి తీసుకొచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య చెప్తున్నారు. ఈ లింక్‌ల ఆధారంగా డ్రగ్ సప్లై ముఠా కూపీ లాగబోతున్నారు NCB అధికారులు. హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్ పట్టుబడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో శివారులో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గంజాయి, గుట్కా, జర్దా, మారక ద్రవ్యాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Read also: KTR: సిరిసిల్ల నేత బ్రతుకుల్లో సిరిసిరి మువ్వలు.. నిన్నమొన్నటి వరకు బతుకమ్మ చీరల తయారీ.. ఇప్పుడు..