గంజాయి.. ఎల్‌ఎస్‌డీ.. కొకైన్.. తీరొక్క తీరులతో చెలామణి అవుతున్న మత్తు దందాకు చెక్ పెడుతోంది తెలంగాణ పోలీసులు. ఇటీవలె గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్ పార్టీల బెండు తీశారు. తాజాగా నానక్ రామ్ గూడలో సాఫ్ట్‌వేర్ మత్తుబాబులే టార్గెట్‌గా గుట్టుగా సాగుతోన్న గంజాయి దందాకు కళ్లెం వేశారు సైబరాబాద్ పోలీసులు. ఈనేపథ్యంలోనే డ్రగ్ పార్టీ నకరాల ఎపిసోడ్ క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. విస్తృత తనిఖీలతో మత్తు దందాకు చెక్ పెట్టడం సహా డ్రగ్ ,గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు.
తాజాగా సిద్దిపేట TS న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా ఆదేశాలతో నానక్‌రామ్ గూడలో నీతు బాయ్ గంజాయి దందాకు చెక్ పెట్టారు పోలీసులు. సిద్దిపేట జిల్లాలో ఇటీవల గంజాయి కేసులో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూపీలాగితే నానక్‌రామ్ గూడలో గంజాయి డొంక కదిలింది. చూడ్డానికి సాదాసీదా ఉన్న నీతుబాయి.. నీటుగా నాటు గంజాయిని విక్రయిస్తోన్న వైనం బయటపడింది. ఖాకీల కంటపడకుండా ఉండేలా ఇంట్లో గ్రిల్స్, ఖాకీలొస్తే సరుకును మ్యాన్‌హోల్‌లో వేసేలా సెటప్ చేసుకున్నారు. సిద్దిపేట పోలీసులు కస్టమర్లలా ఎంట్రీ ఇచ్చి మొత్తం స్టడీ చేశారు. ఆ తరువాత సందీప్ శాండిల్య సీపీ అవినాశ్ డైరెక్షన్‌లో స్పెషల్ టీమ్స్‌లో రంగంలోకి దిగాయి. నీతుబాయి అండ్ గ్యాంగ్ అడ్డంగా బుక్కయ్యారు. సోదా చేస్తే నీతు బాయి ఇంట్లో భారీగా గంజాయి సరుకుతో పాటు 16 లక్షల క్యాష్ పట్టుబడింది.
నీతుబాయి గంజాయి దందా ట్రాక్ రికార్డ్ అంతా ఇంతా కాదు. 2017లోనే ఆమెపై కేసు నమోదైంది. జైలుకు వెళ్లొచ్చిన సరే దందా మానలేదు. గంజాయి మార్క్‌తో 12 కేసులతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగంచారు పోలీసులు. ఇటీవలే ఏడాది పాటు జైలులో ఉండొచ్చిన.. నీతుబాయి మళ్లీ గంజాయి దందా షురూ చేసింది. సాఫ్ట్‌వేర్ ఇలాఖాలో ఇస్మార్ట్‌గా గంజాయి దందాతో డాన్‌గా ఎదిగింది. ఆమె నెట్‌వర్క్ సహా గంజాయి మత్తు రుచిమరిగిన వాళ్లపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా మత్తు దందాపై ఉక్కుపాదమే అంటోంది రాష్ట్ర సర్కార్. మత్తు ఏ మూలలో ఉన్న తాటి తీయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలతో వేట మొదలు పెట్టారు. ఎక్కడ ఎవరు ఎగస్ట్రాలేసినా ఇక దారి అత్తారింటికే..! డ్రగ్స్ వాడ్డం..విక్రయించడం..అలాంటోళ్లకు సహకరించడం కూడా చట్ట రీత్యా నేరం.. తస్మాత్ జాగ్రత్త..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..