Nirmal Suicide: అవమానభారంతో ఆత్మహత్య.. గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయంతో ఒక నిండు ప్రాణం బలి.. అసలేం జరిగిదంటే..?

|

Sep 01, 2021 | 6:48 AM

గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Nirmal Suicide: అవమానభారంతో ఆత్మహత్య.. గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయంతో ఒక నిండు ప్రాణం బలి.. అసలేం జరిగిదంటే..?
Family Suicide
Follow us on

Nirmal Man Suicide: గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామానికి చెందిన వడ్యాల పోశెట్టి (45) అదే గ్రామానికి చెందిన కొత్తగొల్ల భోజన్న దగ్గర ఐదేళ్ల క్రితం14 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అయితే, తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.

అయితే, ఆ భూమిని అదే గ్రామానికి చెందిన గుర్రం నడ్పి ఆశన్న అనే వ్యక్తికి విక్రయించేందుకు పోశెట్టి ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం అతని వద్ద నుంచి రూ.2 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న భోజన్న అతన్ని వారించాడు. భూమి అమ్మవద్దని అడ్డుకున్నాడు. దీంతో అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. బయానా చెల్లించిన ఆశన్న ఒత్తిడి చేసాడు. ఎంతకీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వీడీసీకి ఫిర్యాదు చేసాడు. దీంతో పంచాయతీ నిర్వహించి రూ. 4.50 లక్షలు జరిమానా చెల్లించాలని వీడీసీ తీర్మానించింది. ఈ అవమానం భరించలేక పోశెట్టి ఆదివారం సాయంత్రం పురుగులమందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోశెట్టిని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొశెట్టికి భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనకు కారణమైన 17 మంది వీడీసీ సభ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలకింద కేసు నమోదు చేసారు. 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Read Also…  Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కు.. ఇంతలో వచ్చిన ట్రైన్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..