AP Crime News: బెజవాడలో దారుణం.. కన్నతండ్రిని చంపిన దుర్మార్గుడు.. అడ్డుకోబోయిన శునకంపై..

|

Apr 04, 2022 | 7:07 AM

Son kills father: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతండ్రిని దారుణంగా హతమార్చాడు. నగరంలోని ఉడ్‌పేట వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన

AP Crime News: బెజవాడలో దారుణం.. కన్నతండ్రిని చంపిన దుర్మార్గుడు.. అడ్డుకోబోయిన శునకంపై..
Father Murder
Follow us on

Son kills father: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతండ్రిని దారుణంగా హతమార్చాడు. నగరంలోని ఉడ్‌పేట వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన కృష్ణా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఉడ్‌పేటకు (Woodpeta Vijayawada) చెందిన కిట్టు.. ఆదివారం రాత్రి మద్యం మత్తులో తండ్రి రమేష్‌పై దాడి చేశాడు. అనంతరం కత్తితో తండ్రిని వెంబడించి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే కిట్టు తండ్రిపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపాడు. అయితే.. కిట్టు.. తండ్రిపై దాడి చేస్తున్న క్రమంలో.. పెంపుడు శునకంపై అడ్డుకోబోయింది. ఈ క్రమంలో దానిపై కూడా కిట్టు కత్తితో దాడి చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తండ్రిని చంపిన కొడుకుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read:

Sri Lanka Economic Crisis: ప్రజా ఆగ్రహానికి తలవంచిన శ్రీలంక సర్కార్.. మొత్తం మంత్రివర్గం ఏకకాలంలో రాజీనామా

Viral Video: ‘ఉగాది రోజు నేల వైపు దూసుకొచ్చినవి ఉల్కలు కాదు.. అది చైనా పనే’.! ఆసక్తికర విషయాలు..