Crime News : రోజు రోజుకు మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. మద్యం మత్తు మనిషిని మృగంగా మారుస్తుంది. మద్యానికి బానిసై కన్నవారికి కూడా కడతేరుస్తున్నారు. తాజాగా అలాంటి దుర్ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని ఏటుకూరు లో ఏడుకొండలు అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం డబ్బు కోసం కన్నతల్లి మంగమ్మను వేధించేవాడు. ఈ క్రమంలో కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్య చేసాడు ఏడుకొండలు. స్థానికుల సమాచారం మేరకు నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Crime News : స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన అప్పు.. చివరకు దారుణ హత్యకు దారితీసింది…