
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన వట్‌పల్లి మండలం పల్వట్లలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పల్వ్ల గ్రామానికి చెందిన జంగం చంద్రమౌళికి చెందిన కుటుంబం రోజువారీగా సోమవారం రాత్రి 10 గంటలకు భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమిస్తుండగా చంద్రమౌలి (60), సుశీల (55), అనసూజ, సరిత, శ్రీశైలం ఒక్కసారిగా వాంతలులు, వీరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిని వెంటనే జోగిపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చంద్రమౌలి, సుశీలలను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ముగ్గురు అనసూజ, సరిత, శ్రీశైలం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన హైదరాబాద్‌కు తరలించారు. అయితే వీరు జొన్న రొట్టెలు తినడం వల్ల ఇలా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాగా, వారం రోజుల కిందట ఇదే తరహాలో చంద్రమౌలి తల్లి పెద్ద శంకరమ్మ(70) మృతి చెందింది. కులవృత్తిలో భాగంగా పలువురి ఇండ్ల నుంచి పిండి, బియ్యం, ఇతర వస్తువులు తీసుకొచ్చేది. ఈ క్రమంలో ఎవరి వద్దనో విషం కలిసిన జొన్న పిండి తీసుకొచ్చినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఆమె కూడా జొన్న రొట్టెలు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్ల స్థానికులు చెబుతున్నారు. ఆ రోజు కుటుంబ సభ్యులెవరు జొన్న రొట్టెలు తినకపోవడంతో ఎవరికి ఎలాంటి హానీ కలుగలేదు. సోమవారం రాత్రి మళ్లీ అదే జొన్ పిండితో చేసిన రొట్టెలు తిన్నవెంటనే వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
కాగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ పరామర్శించారు. మరణించిన కుటుంబానికి ప్రభుత్వం తరపున లక్ష రపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.