Road Accident in UP: తల్లి అస్థికలను గంగలో కలిపేందుకు వెళుతుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఓ కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఝాన్సీ మీర్జాపూర్ జాతీయ రహదారిపై రాయ్‌పురా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని రామ్‌నగర్ సమీపంలో ఆదివారం ఉదయం డంపర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తల్లీ, కూతురు సహా నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మహోబాలోని దాద్వారాలో నివసిస్తున్న చారు సింగ్ తల్లి సుమిత్రా రెండు రోజుల క్రితం మరణించింది. దీంతో ఆమె అస్థికలను గంగలో కలిపేందుకు కుటుంబ సభ్యులందరూ ఓమ్ని వ్యాన్‌లో ప్రయాగరాజ్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో రాయ్‌పూరా పోలీస్‌స్టేషన్ రామ్‌నగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు, వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. తెల్లవారుజామున 5గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: