Road Accident in giddalur: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు కల్వర్టును ఢికొంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జిల్లాలోని గిద్దలూరు మండలం దిగువమెట్ట అటవీప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కర్నూలు నుంచి విజయవాడకు వెళ్తున్న క్రమంలో దిగువమెట్ట ప్రాంతంలో ప్రైవేటు బస్సు కల్వర్టును ఢికొని బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నారని.. 14 మంది స్వల్పగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: