సాధారణంగా లైంగిక దాడి, హత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష ఖరారు కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో నెలలు పడితే మరికొన్ని కేసుల్లో ఏళ్లు గడుస్తుంటాయి. అందుకు న్యాయశాస్త్రంలో ఉన్న కొన్ని లొసుగులే కారణం. ‘ సరైన సమయానికి న్యాయం అందకపోవడం కూడా అన్యాయమే’ అన్నట్లు దీర్ఘకాల విచారణలు, దర్యాప్తులతో బాధిత కుటుంబాలకు సరైన న్యాయం దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి నెలరోజుల్లోనే శిక్ష విధించింది గుజరాత్ న్యాయస్థానం. దోషికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.
మాయమాటలతో హత్యాచారం..
గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి చెందిన అజయ్ నిషద్ గత నెల 12న తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి అపహరించాడు. అనంతరం దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆ బాలికను హతమార్చి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. అయితే చిన్నారి కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్టోబర్ 13న నిషద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల్లోనే అతనిపై ఛార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. గుజరాత్ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 25న ఈ కేసు విచారణను ప్రారంభించింది. నిషద్ దోషి అని తేలడంతో అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాలా గురువారం వెలువరించారు. అయితే గుజరాత్‌లోని ఓ ట్రయల్ కోర్టు అది కూడా హత్యాచార కేసులో ఇంత తక్కువ సమయంలో తీర్పు ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also read:
Viral News: బంగారంతో మాస్క్‌ను తయారుచేసిన ఆభరణాల వ్యాపారి.. ధర ఎంతో తెలుసా..
Sabarimala: 15న తెరచుకోనున్న శబరిమల ఆలయం.. దర్శనానికి వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..
కీచకోపాధ్యాయుడు.. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినిపై అఘాయిత్యం.. బాలిక బలవన్మరణం