Man Kills his Father: దారుణం.. కొడుకుని కొట్టాడని.. తండ్రి ప్రాణాన్నే తీసిన ప్రబుద్ధుడు..

Man Kills his Father: చిన్న చిన్న విషయాలకే కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. సొంత కుటుంబసభ్యులను కూడా చంపేందుకు వెనుకాడటం లేదు. తాజాగా.. తన కొడుకుపై చేయి చేసుకున్నాడ‌న్న కోపంతో

Man Kills his Father: దారుణం.. కొడుకుని కొట్టాడని.. తండ్రి ప్రాణాన్నే తీసిన ప్రబుద్ధుడు..
Murder

Updated on: Jul 13, 2021 | 7:24 PM

Man Kills his Father: చిన్న చిన్న విషయాలకే కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. సొంత కుటుంబసభ్యులను కూడా చంపేందుకు వెనుకాడటం లేదు. తాజాగా.. తన కొడుకుపై చేయి చేసుకున్నాడ‌న్న కోపంతో ఓ వ్యక్తి ఏకంగా త‌న తండ్రినే దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజ‌స్థాన్ రాష్ట్రంలోని బ‌న్స్‌వారా జిల్లాలోని తండ్‌వ‌డ్లా గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో సోమ‌వారం చోటుచేసుకుంది. తండ్‌వ‌డ్లా గ్రామానికి చెందిన వెస్టా (50) అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులున్నారు. అయితే.. కొడుకులిద్దరూ బ‌తుకు దెరువు కోసం కుటుంబాలతో గుజ‌రాత్‌కు వ‌ల‌స వెళ్లారు. అయితే.. చిన్న కొడుకు జ‌యంతి ఎనిమిదేళ్ల కుమారుడు మాత్రం తాత, నానమ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాడు. అతని ఆలనా పాలనను వృద్ధులే చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మ‌న‌వ‌డు మాటవినకుండా.. త‌న‌ప‌ట్ల అమ‌ర్యాద‌గా ప్రవర్తించడంతో.. వెస్టా అత‌నిపై చేయిచేసుకున్నాడు.

దీంతో తాత కొట్టిన విషయాన్ని మ‌న‌వ‌డు త‌న తండ్రి జ‌యంతికి ఫోన్ చేసి చెప్పాడు. వెంట‌నే జ‌యంతి ఆదివారం రాత్రే తాను ప‌నిచేసే ప్రాంతం నుంచి సొంతూరుకు వ‌చ్చాడు. తండ్రితో గొడ‌వ‌ప‌డి దారుణంగా కొట్టాడు. ఆ త‌ర్వాత అంతా నిద్రపోయారు. కొడుకు కొట్టిన దెబ్బలకు వెస్టా విలవిలాడాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున లేచి చూసే స‌రికి వెస్టా మరణించి ఉన్నాడు. దీంతో గ్రామస్థులు జయంతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం గ్రామ‌స్తులు ఇచ్చిన స‌మాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టినట్లు వెల్లడించారు.

మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించి నిందితుడైన కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే తాను తండ్రితో గొడ‌వ‌ప‌డి చేయి చేసుకున్నానని.. కానీచంపాల‌ని మాత్రం భావించ‌లేద‌ని నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Ethiopia Clashes: అంతర్యుద్దంతో అట్టుడుకుతున్న ఇథియోపియా.. చిక్కుకున్న తెలుగు కుటుంబాలు..

Hiccups Straw: వెక్కిళ్లకు చెక్ పెట్టిన యూఎస్ శాస్త్రవేత్తలు.. అతి చిన్న పరికరంతోనే సులభంగా సమస్య దూరం..