Rajasthan Man Arrested: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఓ మిలటరి ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళతో.. ఉద్యోగి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని మిలటరీ ఇంజనీర్ సర్వీస్ (ఎంఈఎస్) చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి.. పాకిస్తాన్‌కు గుఢాచర్యం చేశాడని నిర్ధారించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. మిలటరీ కార్యాలయంలో గజేంద్రసింగ్ (35) నాల్గవతరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గజేంద్రసింగ్ పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకొని ఆమెతో తరచూ వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో జైపూర్ పోలీసులు గజేంద్రసింగ్‌పై నిఘా ఉంచగా.. మిలటరీ ఇంజినీరింగ్ కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లు, లేఖలను తన మొబైల్ ఫోన్‌తో క్లిక్ చేసి వాటిని వాట్సాప్‌లో పాక్ మహిళకు పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం గజేంద్రసింగ్‌ను పోలీసులు, నిఘా సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించారు. గజేంద్రసింగ్ మొబైల్ ఫోన్, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళతో జరిపిన వాట్సాప్ చాటింగ్ ను పరిశీలించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గజేంద్రసింగ్ పాక్ మహిళతో అసభ్యకరంగా చాట్ చేశాడని, దీంతోపాటు పలు ఆర్మీ కీలక పత్రాలను పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు గజేంద్ర సింగ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ఉమేశ్ మిశ్రా వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
Also Read: