Pakistan Drone: ఇండో-పాక్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం.. భద్రతా దళాల కాల్పులతో పరార్!

|

Apr 07, 2022 | 12:19 PM

రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరిహద్దుల్లో మాత్రం తన వికృత చేష్టలను మానునకోవడం లేదు. మరోసారి పాకిస్తాన్ సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Pakistan Drone: ఇండో-పాక్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం.. భద్రతా దళాల కాల్పులతో పరార్!
Drone
Follow us on

Indo-Pak Border: రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్(Pakistan).. సరిహద్దుల్లో మాత్రం తన వికృత చేష్టలను మానునకోవడం లేదు. మరోసారి పాకిస్తాన్ సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి డ్రోన్ల(Pakistan Drone)ను పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌(Punjab)లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్థరాత్రి డ్రోన్‌ల కదలిక కనిపించింది. భద్రతా దళాల అప్రమత్తతతో తోక ముడిచింది. అయితే, గత నెలలో కూడా పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్ కనిపించింది, దానిని BSF తరిమికొట్టింది.

గురుదాస్‌పూర్ జిల్లాలోని బోర్డర్ అవుట్ పోస్ట్ రోసా వద్ద అర్థరాత్రి డ్రోన్ కదలిక పట్టుకున్న తర్వాత, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది డ్రోన్‌పై కాల్పులు జరిపారు. నిరంతర కాల్పుల మధ్య, డ్రోన్ తిరిగి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లిపోయింది. ఈ ఘటన తర్వాత ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. కాల్పులతో పాటు, సరిహద్దులో నియమించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది లైట్లు వెదజల్లే షెల్లు బాంబులను కూడా కాల్చారు. అయితే, ఈ సంఘటన తర్వాత, సరిహద్దు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ హఠాత్తు పరిణామంతో సరిహద్దు వెంబడి మరింత భద్రతను పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలావుంటే, గత నెల ప్రారంభంలో, సరిహద్దు దాటి భారత భూభాగానికి డ్రోన్‌లను పంపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో మార్చి మొదటి వారంలో పాకిస్తాన్ డ్రోన్‌ల కదలిక కనిపించింది. మధ్యాహ్నం 1 గంటల సమయంలో బమియాల్ సరిహద్దులోని దిండా పోస్ట్ వద్ద డ్రోన్ కదలిక గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడే ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది డ్రోన్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. సరిహద్దు ఆవల నుంచి వస్తున్న డ్రోన్ భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. డ్రోన్‌ను చూసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. కాల్పులు ప్రారంభమైన తర్వాత డ్రోన్ తిరిగి పాకిస్తాన్ సరిహద్దు వైపు వెళ్లింది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఆ ప్రాంతంలోని ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, సమాచారం అందుకున్న అనుప్‌గఢ్ పోలీస్ SI జైప్రకాష్ కూడా బింజోర్ పోస్ట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దు భద్రతా దళం ఫిబ్రవరి 9న పంజాబ్‌లో రెండు ప్యాకెట్లలో నాలుగు కిలోల ఆర్‌డిఎక్స్ పేలుడు పదార్థాలు, పిస్టల్స్, బాంబు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఇవి పాకిస్తాన్‌కు డ్రోన్‌ల ద్వారా భారత భూభాగంలోకి పంపిన పేలుడు పదార్థాలుగా భద్రతా అధికారులు భావిస్తున్నారు.

Read Also…  Hyderabad: భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్న ఐటీ ఉద్యోగులు.. వేటు వేసిన కంపెనీలు.. దర్యాప్తులో సంచలనాలు