పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కల్పించాలి. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి. సమాజంలో జరిగే నేరాలను అరికట్టాలి. నిందితులను పట్టుకుని చట్టపరంగా శిక్షలు పడే విధంగా చేయాలి. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం తన విధి కర్తవ్యాన్ని మరిచాడు. దొంగలతో చేతులు కలిపాడు. పక్కా ప్లాన్ తో బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డాడు. సిబ్బందికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఏకంగా 32 కిలోల బంగారం కొట్టేశాడు. నిందితులను విచారిస్తున్న సమయంలో ఈ కీలక సమాచారం వెల్లడైంది. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజధాని చెన్నై లోని ఫెడరల్ బ్యాంకులో నగల దోపిడీ (Bank Robbery) కేసు సంచలనంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. ఈ కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఓ పోలీసు అధికారే దొంగలతో చేతులు కలిపి ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసి అవాక్కయ్యారు. 32 కిలోల బంగారం దోపిడీ లో ఇన్స్పెక్టర్ అమల్‌రాజ్ మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. పక్కా ప్లాన్‌తో బ్యాంక్ దోపిడీ చేశాడు. బ్యాంకు దోపిడీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో దొంగల నుంచి ఈ విషయాలు తెలుసుకున్నాుర. ఇన్స్‌పెక్టర్ బాగోతాన్ని దొంగలు బయటపెట్టారు. వారు చెప్పిన ఆధారాలతో ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు కిలో బంగారాన్ని గుర్తించారు.
కాగా.. ఈ నెల 13 న చెన్నై అరుంబాక్కం లోని ఫెడరల్ బ్యాంకు లో భారీ దోపిడీ జరిగింది. సిబ్బందికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఏడుగురు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి 18 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ముఠాను విచారిస్తున్న సమయంలో విస్తుపోయే నిజాలు గుర్తించారు. ఇన్స్‌పెక్టర్ అమల్రాజ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ దొంగతనానికి సంబంధించిన పూర్తి బంగారాన్ని రెండు మూడు రోజుల్లోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని నేర వార్తల కోసం చూడండి..